మెయిన్ ఫీచర్

లెహంగా హంగామా! ( ఆధునిక డిజైన్లతో మార్కెట్లో కనువిందు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది పెళ్లిళ్ల సీజన్. పెళ్లికి చీర కదా కట్టాల్సింది అనుకుంటే ఆధునిక ఫ్యాషన్ అర్థంకానట్టే. సింపుల్‌గా స్టైల్‌గా కనిపించడానికి పాశ్చత్య దుస్తులే అక్కర్లేదు. లెహంగాకు కొన్ని రంగులు, మరికొన్ని హంగులు చేర్చితే అబ్బురపరిచే సంప్రదాయ కళ కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. సంప్రదాయ లెహంగాలు పాతకాలపు ప్యాషన్‌గా మారిపోయింది. అందుకే అందంగా, హంగూ ఆర్భాటంగా కనిపించాలంటే డిజైనరీ లెహంగాలనే ఇష్టపడుతున్నారు. నేడు సరికొత్తగా లెహంగాపై షర్ట్ ధరించి అమ్మాయిలు ఆధునికంగా కనిపించటానికి తహతహలాడుతున్నారు. పెళ్లి అనగానే చాలా వరకు ఎరుపు, పచ్చ రంగు లెహంగాలనే ఎంచుకుంటారు.
వీటిలో ముదురు రంగులను ఎంచుకుంటే మరింత గ్రాండ్‌గా కనిపిస్తారు. అలాగే నైట్ ఫంక్షన్‌లో చందమామ వలే వెలిగిపోవాలంటే లెహంగా సరైన ఎంపిక అని ఫ్యాషన్ డిజైనర్లు సైతం అంగీకరిస్తున్నారు. బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ‘తను వెడ్స్ మను’లో కంగనా లెహంగా, షర్ట్‌తో అలరించింది. మళ్లీ అలాంటి రోజులే పునరావృతం అవుతున్నాయంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. ఆధునిక డిజైన్లతో మార్కెట్లో కనువిందు చేస్తున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్ కథానాయికులు అలియాభట్, తమన్నా భాటియా, సమంత, రాశీఖన్నా తదితరులు లెహంగా, షర్ట్‌లను ఇష్టపడుతున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ లో ఇదొక సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది. వేసవిలో సౌకర్యవంతంగా ఉండటంతో పాటు కూల్‌గా మార్చేసే రంగులు, గాడీగా లేని డిజైన్లు గల లెహంగాలను ఎంచుకుంటే ఫంక్షన్‌లో ప్రత్యేకంగా కనిపించటం ఖాయం. ప్రతి ఇంట్లో సంప్రదాయం ఉట్టిపడుతూ, కనువిందుచేసే రంగులను అద్దుకుని మార్కె ట్లో సందడి చేస్తున్నాయి. నైట్ ఫంక్షన్‌లో వెనె్నల్లా మెరిసిపోవాలంటే తెల్లని షర్ట్‌మీద కాఫీ బ్రౌన్ లేదా లైట్ అండ్ డార్క్ బ్లూ,రెడ్ కలర్ లెహంగాలు ధరిస్తే సంప్రదాయబద్ధంగా కనిపిస్తారు. శాంతికి చిరునామాగా కనిపించే స్లీవ్‌లెస్ వైట్ షర్ట్ మీద ముదురు రంగు లెహంగానే ధరిస్తేనే బాగుంటుందని ఫ్యాషన్ డిజైనర్ విజయ్ రానా సూచిస్తున్నారు.
ఆఫ్ షోల్డర్ షర్ట్ మీద ఎరుపు లేదా కాపీ బ్రౌన్ లెహం గా ధరించటంతో పాటు కొద్దిపాటి నగలు, తలలో పూలు పెట్టుకుంటే రాయల్ లుక్‌తోకనిపించటం ఖాయం అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్ శ్రావణ్ కుమార్. అలాగే డబుల్ కలర్ లెహంగా ట్రెండ్ నడుస్తుంది. లెహంగా అంచు పూర్తి కాంట్రా స్ట్..లేదంటే మల్టీకలర్‌లో ఉన్నది ఎంపికచేసుకున్నా చూడముచ్చటగా ఉంటా రు. సంప్రదాయాన్ని చాటుతూనే వెస్ట్రన్ స్టైల్‌తో కనిపించాలంటే చక్కని కాంబినేషన్ షర్ట్, లెహంగా డ్రెస్.

చిత్రం...ఫుల్ హ్యాండ్స్ షర్ట్‌తో మెరూన్ కలర్ లెహంగాలో మెరిసిపోతున్న బింద్రా, సమంత