ఐడియా

అన్నార్తుల పాలిట ఆత్మబంధువు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదైనా పండగ, శుభకార్యం సందర్భంగా నచ్చిన వంటలు వండుకుని ఇంటిల్లిపాదీ విందు ఆరగించి సంతోషంగా గడపడం అందరూ చేసేదే. ఇందుకు భిన్నంగా అన్నార్తుల కడుపు నింపాలని ఆమె భావించింది. ‘పొరుగువారి ఆకలి తీర్చాలి’ అన్న నినాదంతో ఆమె ప్రారంభించిన అన్నదాన కార్యక్రమం ఇపుడు అనూహ్యంగా విస్తరించింది. బెంగళూరుకు చెందిన మహితా ఫెర్నాండెజ్ (34) ఇటీవల దసరా సందర్భంగా సుమారు లక్షమంది పేదలకు కడుపునిండా భోజనం పెట్టి అందరి ప్రశంసలు అందుకున్నారు. ‘్ఫడ్ యువర్ నైబర్’ (ఎఫ్‌యుఎన్) పేరిట ఆమె ప్రారంభించిన కార్యక్రమంలో ఇపుడు సుమారు ఏడువేల మంది స్వచ్ఛంద సేవకులు పనిచేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ‘స్టార్‌ప్లస్’ చానల్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌తో పాటు మహిత కూడా పాల్గొని తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ‘అన్నదాన కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్న మహిత నిజమైన హీరో..’ అని అమితాబ్ ప్రశంసలతో ముంచెత్తారు.
ఇతరుల ఆకలి తీర్చాలన్న ఆలోచన తనకు కలగడానికి ఓ సంఘటన ఎంతగానో ప్రేరణ ఇచ్చిందని ఆమె చెబుతుంటారు. కొనే్నళ్ల క్రితం ఓ రోజు రాత్రి తాను ఎలాంటి ఆహారం తీసుకోకుండా నిద్ర పోయేందుకు ప్రయత్నించానని, ఖాళీ కడుపుతో ఆకలిగా ఉన్న సమయంలో నిద్ర పట్టడం అసాధ్యమని తాను అనుభవపూర్వకంగా తెలుసుకున్నానని ఆమె వివరిస్తున్నారు. బద్ధకం కారణంగా ఏమీ తినకుండా నిద్ర పోవాలనుకున్న తనకు ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలిసిందని, నడివీధుల్లో తిండిలేక అలమటించే వారి దుస్థితి ఎంతటిదో ఊహించుకోవాలంటేనే భయం వేస్తుందని మహిత చెబుతుంటారు. ఆకలి వల్ల నిద్రలేమి, ఆరోగ్య సమస్యలుంటాయని తెలిశాక పేద ప్రజల కోసం ఏదైనా చేయాలన్న ఆలోచన తనలో కలిగిందని ఆమె గుర్తు చేస్తుంటారు. అనాథ పిల్లలు, వృద్ధులకు ఆహారం అందించేందుకు సహాయ పడాలంటూ ఆమె ‘ఫేస్‌బుక్’లో చేసిన విజ్ఞప్తికి అనూహ్యమైన స్పందన లభించింది. బెంగళూరు నగరంలో ఆహారం పంపిణీ చేసేందుకు పది ప్రాంతాలను ఎంపిక చేసినట్లు ఆమె ప్రకటించడంతో వెంటనే సుమారు రెండువేల మంది స్పందించి సేవలందించేందుకు ముందుకువచ్చారు. ఆ తర్వాత ఆమె ఇల్లు భారీ కిచెన్‌లా మారిపోయింది. మొదట్లో రోజుకు 600 మందికి సరిపోయేలా వంటలు చేసేవారు. ఆ తర్వాత పనె్నండు వేలమందికి ఒకేసారి భోజనాలు అందేలా ఏర్పాట్లు చేశారు.
కొన్నాళ్లపాటు చెన్నైలో ఓ కార్పొరేట్ సంస్థలో సమాచార విభాగంలో మహిత పనిచేశారు. అక్కడే ఓ ఈవెంట్ మేనేజిమెంట్ సంస్థలో పనిచేసే స్టీవ్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. కొడుకు పుట్టాక ఆమె భర్తతో పాటు బెంగళూరు చేరుకున్నారు. మళ్లీ ఉద్యోగంలో చేరాలని ఆమె ప్రయత్నించినప్పటికీ యాజమాన్యం అందుకు సమ్మతించలేదు. ఆ తర్వాత ఆమె పిల్లల వినోదం కోసం ‘గంబొల్లా’ పేరిట ఓ సంస్థను ప్రారంభించారు. పరిశుభ్రమైన వాతావరణంలో పిల్లలు ఉండాలన్న ఆశయంతోనే ఈ సంస్థను ప్రారంభించినట్లు ఆమె చెబుతుంటారు. సంగీతం, వన్యప్రాణులు, నృత్యం, ప్రకృతి ఆరాధన అంటే ఆసక్తి ఉన్న మహిత- చిన్నారుల అభిరుచులను గమనించి వారిని ప్రోత్సహించాలని అంటారు. ప్రకృతి వైపరీత్యాల్లో కష్టాల పాలైన పిల్లలకు ఆహారం, దుస్తులు, పుస్తకాలు వంటివి అందజేసేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి మహిత పనిచేస్తున్నారు. చిన్నపిల్లలు సైతం వారు దాచుకున్న డబ్బును తనకు విరాళంగా ఇస్తున్నారని, కొంతమంది వృద్ధ మహిళలు కూడా వంటలు చేసేందుకు ముందుకు వస్తున్నారని ఆమె చెబుతున్నారు. అన్నదాన కార్యక్రమాన్ని శాశ్వత ప్రాతిపదికపై కొనసాగించే ఆలోచన ఉన్నదని మహిత తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నారు. *