ఐడియా

అందరికీ ఆరోగ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది హైదరాబాద్ మహానగరంలోని సంజీవయ్య పార్క్. సూర్యుడి లేలేత కిరణాలు పచ్చటి గడ్డిమీద ఆసనాలు వేస్తున్న గృహిణుల మీద పడి వింత శోభ కలిగిస్తుంది. ప్రతి శనివారం ఈ పార్క్‌కు వెళితే.. ఎంతోమంది ‘అమ్మలు’ శ్రద్ధగా వ్యాయామం చేస్తూ కనిపిస్తుంటారు.
కుటుంబానికి ఇంటి యజమాని తల అయితే.. మెడ వంటిది ఆ ఇంటి యజమానురాలు. మెడ లేకపోతే తల నిలవదు. ఫలితంగా కుటుంబమే స్ట్రాంగ్‌గా ఉండదు. కుటుంబంలోని మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబమే సాఫీగా సాగిపోతుంది. ఇలాంటి దృక్పథంతోనే బబితా జేవియర్ ఆరంభించిన గృహిణులకు వ్యాయామం కార్యక్రమానికి రోజురోజుకు ఆదరణ లభిస్తుంది. ఈ వ్యాయామానికి 80 మంది హాజరైతే.. ఇందులో తొంభైశాతం మంది గృహిణులే ఉంటారు. నిత్యం పనిచేసుకుంటాం అదే వ్యాయామం అనుకునే గృహిణులే దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని గ్రహించాలంటారు బబిత. తప్పనిసరిగా వారంలో నాలుగైదు రోజులు వ్యాయామం చేయాలని చెబుతారామె.
ఎలా వచ్చింది ఈ ఆలోచన
అథ్లెటిక్ క్రీడాకారిణి బబితా జేవియర్. ఆమెకు ఎన్నో పతకాలను సొంతం చేసుకున్నది. రెండేళ్ల క్రితం దక్షిణాసియా చాంపియన్‌షిప్‌ను సైతం సొంతం చేసుకున్నారు. చాలామంది మహిళలు క్రీడాకారిణిగా ఆమెను అభినందిస్తూ.. నేను కూడా మీవలే ఉంటే ఎంత బాగుంటుందో కదా అనేవారు. ఎందుకు కాకూడదు అని సమాధానం చెప్పేది. ఇలా చెప్పే మాటనే నిజం చేస్తూ ఇంట్లో ఉండే గృహిణులకు ఫిట్‌నెస్‌లో మెళకువలు చెబితే ఎలా ఉంటుంది అనే ఆలోచన రావటంతో ఏడాది క్రితం ఓ గ్రూప్‌ను తయారుచేసింది. ఇద్దరితో కలిసి ప్రతిరోజూ సంజీవయ్య పార్క్‌కు వచ్చి వ్యాయామం చేస్తుండేది. ఇలా చేస్తున్న వ్యాయామం ఫొటోలను సామాజికమాధ్యమాల్లో పోస్ట్ చేసింది. మెస్సేజ్‌లు పంపింది. అంతేకాదు మాటే ప్రచారంగా మారి ఎంతోమంది ఇక్కడకు వచ్చి వ్యాయామం చేయటానికి ముందుకు వచ్చారు. ఇలా రోజురోజుకు వస్తున్న గృహిణులతో వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసింది. ఇలా ప్రతిరోజూ మహిళలు చేస్తున్న వ్యాయామానికి ఆకర్షితులైన గృహిణులు నేడు దాదాపు 83 మందివరకు వస్తున్నారు. చాలామంది గృహిణులు తాము వ్యాయామం చేస్తూ తమ పిల్లల్ని కూడా తీసుకువస్తుంటారు. ఇక్కడ వ్యాయామం చేసేవారు ఎనిమిదేళ్ల నుంచి 62 ఏళ్ల ముదుసలి వరకు ఉన్నారు.