మెయిన్ ఫీచర్

‘లిప్‌స్టిక్’ ఇలా వచ్చిందట..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ దేశంలోనైనా సహజంగా మహిళలు సౌందర్యోపాసకులు. వీరు సాధ్యమైనంత వరకూ అందంగా కనిపించాలనే ఆరాట పడుతుంటారు. నేడు మహిళలు వినియోగించే సౌందర్య సాధనాల్లో అత్యంత ప్రధానమైనది లిప్‌స్టిక్. మహిళల పెదాలకు లిప్‌స్టిక్ మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది. కాస్మొటిక్స్ వినియోగంపై ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ 21 శాతం మంది , పండగులు, ఫంక్షన్ల సందర్భంగా 78 శాతం మంది మహిళలు లిప్‌స్టిక్‌ను వినియోగిస్తున్నారు. ఇంతగా మగువలు వాడే లిప్‌స్టిక్‌కు చాలా చరిత్ర ఉంది. ప్రపంచంలో మొట్టమొదట లిప్‌స్టిక్‌ని వినియోగించిన ఘనత బాబిలోనియా మహిళలకు దక్కింది. వీరు జాతిరాళ్ళను పేస్టులా చేసి, దానిని తమ పెదాలకు పూసుకొనేవారు. రసాయన పదార్థాలతో లిప్‌స్టిక్‌ను ఈజిప్టులో తొలిసారిగా తయారుచేశారు.
తన సౌందర్యంతో ప్రపంచ రాజకీయాలను ఎంతగానో ప్రభావితం చేసిన క్లియోపాత్ర కెంపువనె్న కలిగిన కుమ్మరి పురుగులు, చీమలను వినియోగించడం ద్వారా లిప్‌స్టిక్‌ను తయారుచేసుకొనేవారట. మన దేశంలో మహిళలు తాంబూలం వేసుకుంటూ తమ పెదవులు ఎర్రని దొండపండ్లలా ఉండేటట్లు చేసేవారు.
ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా మహిళలు వినియోగిస్తున్న లిప్‌స్టిక్ 16వ శతాబ్దంలో తయారైంది. మొదటి ఎలిజిబెత్ రాణి తేనె తుట్టెలోని మైనంకు మొక్కల నుంచి తీసిన ఎరుపు ద్రవంను కలపడం ద్వారా 16వ శతాబ్దంలో లిప్‌స్టిక్‌ను తయారుచేశారు. 1883లో హాలెండ్ రాజధాని అమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన ప్రపంచ స్థాయి ఎగ్జిబిషన్‌లో ఆధునికంగా తయారుచేసిన లిప్‌స్టిక్‌ను ప్రదర్శించారు. 1883లో పర్షియాకు చెందిన సుగంధ ద్రవ్యాల వ్యాపారులు ఆముదం, తేనె తుట్టెలోని మైనం, లేడి లేదా దుప్పి కొవ్వుతో లిప్‌స్టిక్‌ను తయారుచేసి సిల్క్ పేపర్‌లో చుట్టి విక్రయించేవారు. తొలుత ఎరుపు రంగులో తరువాత నలుపు, ఆకుపచ్చ రంగులలో లిప్‌స్టిక్‌ను తయారుచేశారు. 1912లో మెటల్ ట్యూబ్‌లో లిప్‌స్టిక్‌ను ఉంచి విక్రయించారు. దీంతో లిప్‌స్టిక్ ధర అందరికీ అందుబాటులోకి వచ్చింది. 1920లో మూకీ సినిమాల్లో నటించిన మహిళలు లిప్‌స్టిక్‌ను వినియోగించారు. అదే సంవత్సరం పుష్‌డ్ ట్యూబ్‌లో లిప్‌స్టిక్ వచ్చింది.
అమెరికాకు చెందిన కంపెనీలు 1930లో వివిధ రంగులలో లిప్‌స్టిక్స్ తయారుచేయడం ప్రారంభించాయి. 1948-49లో ప్రస్తుతం వినియోగిస్తున్న లిప్‌స్టిక్ రొటేటింగ్ మెకానికల్ ట్యూబ్‌ను అమెరికాలో తయారుచేశారు. 1950లో సహజ సిద్ధమైన రంగులు, సువాసన నూనెలు, మైనంతో లిప్‌స్టిక్‌ను తయారుచేశారు. 1971లో మొట్టమొదటి సారి ఆర్గానిక్ లిప్‌స్టిక్‌ను మైనం, ఆముదం, సహజ సిద్ధ పదార్థాలు (రసాయనాలు లేకుండా) తయారుచేశారు. మహిళల ఆదరణ చూరగొన్న ఘనత సౌందర్య సాధనాలలో లిప్‌స్టిక్‌కే దక్కుతుంది.

-పి.హైమావతి