Others

ఈ చిరుగు మెరుగే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరిగిన డ్రెస్సులు వేసుకోవడం నేడు కొత్త ఫ్యాషన్. ముఖ్యంగా మోకాళ్ల మీద, కింద భాగంలో చిరుగులు ఉండే జీన్ ప్యాంట్లు వేసుకోవడం ఈకాలపు యువతలో వేలం వెర్రిగా మారింది. బాలీవుడ్ నటీనటుల పుణ్యమాని ఈ ట్రెండ్ దేశం మొత్తం వ్యాపించింది. జీన్స్ దుస్తులు ఎప్పుడో రంగప్రవేశం చేసినా, ఇపుడున్నంత ఆదరణ అప్పుడు ఉండేది కాదు. పాశ్చాత్య సంస్కృతి విస్తరించడంతో కొత్త ఫ్యాషన్లపై యువతలో మోజు పెరుగుతోంది. జుట్టు చెదిరిపోయి, చినిగిన దుస్తులను ధరించడం ఇప్పుడో వింత ఫ్యాషన్. చిరిగిన జీన్స్ ఇపుడు విభిన్న శ్రేణుల్లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. యువతలో క్రేజ్ పెరగడంతో ఫ్యాషన్ డిజైనర్లు వీటిని వెరైటీగా రూపొందిస్తున్నారు. నచ్చిన మోడల్ ఏదైనా ఎంత డబ్బు పోసి కొనేందుకైనా యువత సిద్ధం అంటోంది. చిరిగిన దుస్తులు వేసుకునేందుకు ఏ మాత్రం సిగ్గు పడడం లేదు. చిరుగుల్లో చెదరనివి అందాలను ప్రదర్శిస్తున్నారు బాలీవుడ్ భామలు. అనుష్క శర్మ, దీపికా పదుకొనె, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా, సోనాక్షి సిన్హా లాంటి యువ నటీమణులు ‘రిప్డ్ జీన్స్’ (చిరిగిన)లో తెగ సందడి చేస్తున్నారు. మూడు వేల నుంచి ముప్ఫయి వేల వరకు ధర పలికే ఈ జీన్స్‌ను ప్యాషన్ ప్రియులు ఇష్టపడుతున్నారని బ్రాండెడ్ కంపెనీలు చెబుతున్నాయి.
1970 ప్రాంతంలో హాలీవుడ్ పాప్ సింగర్స్ ఈ తరహా జీన్స్ ఎక్కువగా ధరించేవారట! ఆ తర్వాత ఈ ట్రెండ్ ఇతర దేశాల్లోకూ వ్యాపించింది. ఇపుడు మన దేశంలో ఇదో ఫ్యాషన్ కావడంతో చిరిగిన ప్యాంట్లకు తగ్గట్టుగా టీషర్ట్, వాచీ, ప్రత్యేకమైన యాక్సరీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటిని ధరించినపుడు తల వెంట్రుకలను కూడా చిందర వందరగా ఉంచుకోవడం ఈ ఫ్యాషన్ ప్రత్యేకత. వీటిని వేసుకున్నవారు అందరిలోనూ భిన్నంగా కనిపిస్తారు. మోకాలి మీద, ఇంకొంచెం పైభాగంలో చినిగినట్లు కనిపించే కొత్త రకం జీన్స్ ధరిస్తే ‘సమ్‌థింగ్’ స్పెషల్‌గా ఉంటామని యువతీ యువకులు భావిస్తున్నారు. ఫ్యాషన్ ట్రెండ్ ఏదైనా- మనకు నప్పుతుందా? లేదా? అని చూసుకోవడం చాలా ముఖ్యం. వీటి ధర, నాణ్యత, సౌకర్యం గురించి కూడా ఆలోచించాలి. అన్నిటికంటే ముఖ్యంగా అశ్లీలతకు దూరంగా ‘డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్’గా వుంటే ఏ దుస్తులైనా చూడముచ్చటగా ఉంటాయి.

-మాధురీ లక్ష్మి