సబ్ ఫీచర్

సంప్రదాయంలో ‘సైన్స్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సంప్రదాయం’ అంటే తరతరాలుగా ప్రత్యక్ష అనుభవంలో ఉంటూ, మన పెద్దల ద్వారా మనకు లభించిన జీవన విధానం అని అర్థం. ప్రతిరోజూ ఉదయానే్న మనం నిద్రలేచి తిరిగి రాత్రి నిద్రపోయే వరకు చేయవలసిన దైనందిన కార్యక్రమాలను ఎలా నిర్వహించాలో తెలిపేదే సంప్రదాయం. జీవితంలో మంచి జరిగినా, చెడు జరిగినా అది మనం చేసే పనులు, మన అలవాట్లపైనే ఆధారపడి ఉంటుందని అందరూ ఒప్పుకొనితీరే నిర్వివాద అంశం. ‘మంచి ఫలితాలు మంచి పనుల వల్లనే లభిస్తాయి. చెడు ఫలితాలు చెడు పనుల వల్ల లభిస్తాయి’ అనే సత్యాన్ని మనం తరచుగా మరచిపోతూ చెడు పనులు చేసి కష్టాల పాలవుతూవుంటాం. ఇలా కష్టాలు పడే పరిస్థితిని అడ్డుకొనేందుకే మన పెద్దలు మంచి పనులకు ‘పుణ్యం’ అనీ, చెడ్డ పనులకు ‘పాపం’ అనీ పేరుపెట్టి, చెడ్డ పనుల వైపునకు మనం వెళ్లకుండా నిరోధించే ప్రయత్నం చేయడం జరుగుతున్నది.
వేకువ జామున నిద్రలేవడం, రాత్రిళ్లు త్వరగా నిద్రపోవడం, కాల నియమం ప్రకారం భోజనం చేయడం, మితంగా ఆహారం తీసుకోవడం, ఉద్రేకాలనూ, మత్తును కలిగించే పదార్థాలను విసర్జించటం ఇత్యాదులు అన్నీ మనకు సంప్రదాయాలుగా లభించాయి. మన పెద్దలు బలవంతంగానైనా వీటిని అలవడేట్టు చేయడానికై భక్తినీ, భయాన్ని జోడించి మనకు నేర్పేవారు.
గత కొన్ని దశాబ్దాలుగా మనం చాలా వరకూ ఈ సంప్రదాయాలను విస్మరించడమే కాక మన దేశంపై విదేశీయుల దాడుల ఫలితంగా పరాయి అలవాట్లను అమలులోకి తెచ్చుకొని అనేక చిక్కుల పాలు కావాల్సి వచ్చింది. కానీ, కాలక్రమేణా పాశ్చాత్యులే ప్రాచీన సంప్రదాయాలలోని ఔన్నత్యాన్ని గ్రహించటంతో వాటిలోని ‘సైన్స్’ వెల్లడి అవుతున్నది.
మన దేశంలో పెరుగు లేక మజ్జిగ వేసుకుని భోజనం ముగిస్తాము. పాశ్చత్య దేశాలలో ఎందువల్లనో ఈ సంప్రదాయం మరుగైపోయింది. అందువల్ల ఈ సంప్రదాయం అర్థరహితం అని చాలాకాలం వాదించిన పాశ్చాత్యులు, ఇప్పుడు కళ్ళుతెరిచి రోజూ ఒక కప్పు పెరుగు తినగలిగేవారు మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం పరిశోధనలు తెలపడంతో వారు మళ్లీ ఇటువైపు మొగ్గుతున్నారు. ఇటీవలి కాలంలో విదేశీ వైద్య పుస్తకాల్లో ఇటువంటి జీవన విధాన అంశాలే హెచ్చుగా కానవస్తున్నాయి.
పాశ్చాత్యులకు బాగా అలవాటైనది మాంసాహారమే. వారికి శాకాహార ప్రాముఖ్యం తెలియనే తెలియదు. ఇంగ్లాండ్‌లోని పరిశోధకులు ఆకుకూరల్ని ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే సత్ఫలితాలను గురించి ఇపుడు విశేష ప్రచారం చేస్తున్నారు. వారు కనుగొన్న ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బాల్యంలో, యవ్వనంలో విశేషంగా ఆకుకూరలు తినేవారు వయసు మళ్లిన తరవాత ఎట్టి అనారోగ్యాలకు గురికాకుండా బలంగా ఆరోగ్యంగా హాయిగా ఉండగల్గుతున్నారని.
ఏమిటి దీనికి కారణం? ఆకుకూరల్లో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. అది రక్తంలోని చక్కెరను నియంత్రించి రోగ నిరోధక శక్తిని ఇస్తుంది.
మధుమేహ వ్యాధికి కారణం- రక్తంలో చక్కెరల నియంత్రణ లోపమేనని, ఆకుకూరలు తినేవారికి ఈ వ్యాధి ప్రమాదం చాలావరకు తగ్గుతుందనీ- దీనిని పేదల ఆహారంగా విభజిస్తూ ఖరీదైన మాంసాహారానికి ఎగబడి వారు వివిధ వ్యాధులకు గురి కావాల్సి వస్తున్నదని వారు హెచ్చరిస్తున్నారు. సక్రమంగా తోడుపెట్టిన పెరుగును అన్నంలో కలుపుకొని తినేవారికి సుగర్ వ్యాధి ప్రమాదం 28 శాతం తగ్గుతుందని వారు నిర్థారిస్తున్నారు. శ్వాసక్రియలో ప్రత్యేక అంశంగా వారు చెబుతున్న విషయం- రోజుకు ఒకసారి అయినా ‘ప్రాణాయామ’ పద్ధతిగా ఒక నాసికా రంధ్రం ద్వారా గాలి పీల్చి రెండవ ముక్కు ద్వారా వదలడం అలవాటు చేసుకోవాలని వర్జీనియా విశ్వవిద్యాలయం పరిశోధకులు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఈ మహత్తర విషయం ఇది.

-సన్నిధానం యజ్ఞ నారాయణమూర్తి