ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖ వర్ఛస్సును పెంచుకునేందుకు ఖరీదైన కాస్మొటిక్స్ వాడుతూ, బ్యూటీ పార్లర్లకు వెళ్లి బోలెడు డబ్బు ఖర్చు చేయడం కంటే- కాఫీ పొడిని వాడడం ఎంతోమేలు. రుచి కోసమే కాదు, శారీరక అందాన్ని మరింతగా ఇనుమడింపజేసేందుకు కూడా కాఫీ పొడిని వాడొచ్చు. మంచి యాంటీ ఆక్సిటెంట్‌గా పనిచేసే కాఫీ పొడిని శరీరానికి రాసుకుంటే రక్తప్రసరణ మెరుగవుతుంది. ఫలితంగా చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. చెంచాడు కాఫీపొడిలో కాస్త పాలు కలిపి ముఖానికి ‘ప్యాక్’లా వేసుకుంటే కళ్ల కింద నల్లటి వలయాలు, మచ్చలు, మొటిమల నుంచి ఉపశమనం కలుగుతుంది. చెంచాడు కాఫీపొడిలో కాసిన్ని వేడినీళ్లు, ఆవపొడి, కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె, దాల్చిన చెక్క పొడి, మెత్తటి పంచదార, కోడిగుడ్డులోని పచ్చసొన కలిపి ముద్దలా చేసుకుని తలకు పట్టించి అరగంట తర్వాత షాంపూతో కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే శిరోజాలు మృదువుగా, బలంగా ఉంటాయి. కాఫీ పొడిని నీళ్లలో మరిగించి చల్లారాక ఆలివ్ నూనె కలిపి తలకు రాసుకున్నా శిరోజాలు దృఢంగా పెరుగుతాయి. కాఫీ పొడిలో మెత్తటి పంచదార, ఆలివ్ ఆయిల్ కలిపి శరీరానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.