సబ్ ఫీచర్

ఉపవాసం మితిమీరితే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారంలో ఏదో ఒక రోజు రాత్రిపూట ఆహారం తీసుకోకుండా ఉపవాసం పాటించడం మన భారతీయ సంస్కృతిలో ఓ ఆచారంగా వస్తోంది. దేవుడిమీద భక్త్భివంతో ఉపవాసం ఆచరించినా అది పరోక్షంగా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే, ఈ అలవాటు అతిగా మారి కఠోర ఉపవాసాలు పాటిస్తే అనారోగ్యం పాలయ్యే ప్రమాదం లేకపోలేదు. శారీరక బరువును తగ్గించుకుని నాజూగ్గా ఉండాలన్న తపనతో తరచూ భోజనం మానేయడం నేడు వేలం వెర్రిగా మారుతోంది. అవగాహన లేకుండా ఎలా పడితే అలా ఉపవాసదీక్షలు చేస్తుంటే దీర్ఘకాలంగా ఆరోగ్యానికి హాని జరగవచ్చు. కఠినమైన ఉపవాసాలు కచ్చితంగా అనారోగ్యానికి దారితీస్తాయని వైద్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఉపవాసం కారణంగా శరీరానికి కొన్ని గంటలపాటు ఎలాంటి ఆహారం అందదు. ఆధ్యాత్మిక చింతనతో చేసినా, బరువు తగ్గేందుకు చేసినా ఉపవాసం మితిమీరితే అనర్థాలు తప్పవు. సరైన పద్ధతిలో దీన్ని ఆచరిస్తే మంచి ఫలితాలే ఉంటాయి. ఉపవాసం వల్ల శరీరంలో కొవ్వును కరిగించుకోవచ్చు. కానీ, ఎక్కువసేపు కడుపు మాడ్చుకుంటే నీరసం వచ్చే ప్రమాదం ఉంది. కొవ్వు నిల్వలను శరీరం వినియోగించుకోవడం ఆరంభించడం మొదలైతే కండరాలు, కణాలు క్రమంగా బలహీనపడతాయి.ఉపవాసాన్ని సరిగా చేయకుంటే కొవ్వు కంటే కండలే ఎక్కువగా కరిగిపోతుంటాయి. మధుమేహ రోగులు, గర్భవతులు, దీర్ఘకాలిక రోగాలకు మందులు వాడేవారు ఉపవాసాలు చెయ్యకూడదు. శరీర వ్యవస్థ పనిచేయాలంటే ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు అవసరం అవుతాయి. ఇవన్నీ కొవ్వు రూపంలో నిల్వ ఉండవు. ఆహారం తీసుకోవడం నిలిపివేస్తే శరీరానికి ఎలాంటి పోషకాలూ అందవు. కఠిన ఉపవాసాల ఫలితంగా నోరు, గొంతు ఎండిపోవడం, తలనొప్పి వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఎక్కువ గంటలు ఉపవాసం ఉంటే ఎలక్ట్రోలైట్ పరిమాణంలో అసమతుల్యత ఏర్పడుతుంది. నీరసం, జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు సైతం ఆరంభమవుతాయి. తరచూ ఉపవాసాలు చేసేవారు శక్తినిచ్చే పానీయాలనైనా తీసుకోవడం మంచిది.

-హిమజారమణ