ఐడియా

చలివేళ అధరాల సొగసుకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శీతాకాలంలో చలిగాలి ప్రభావం వల్ల పెదాలు తేమను కోల్పోతాయి. అధరాలపై సెబాషియన్ గ్రంథులు సున్నితంగా వుంటాయి. చలికాలంలో పెదాలు తడారిపోవడంతో అవి పగిలిపోయి కొన్నిసార్లు నొప్పిని కలిగిస్తాయి. పగిలిన చర్మాన్ని చేత్తో లాగుతుంటే చర్మంపై రక్తస్రావం జరగడమే గాక బాధ అధికమవుతుంది. తేమగా ఉండాలని పెదాలని నాలుకతో తడుపుతూండటం మంచిది కాదు. ఇలాచేసినా పెదాలపై సున్నితమైన చర్మం చిట్లిపోతుంది. శీతగాలుల వేళ పెదవుల అందం గురించి తగినంత శ్రద్ధ తీసుకోవాలి. పెదాలకు వెన్న, నెయ్యి, వేజలైన్ లాంటి జిడ్డు పదార్థాలను రాస్తే, ఎక్కువ సేపు పెదాల చర్మానికి తేమ అంటిపెట్టుకునే ఉంటుంది. లిప్‌బామ్‌ను కూడా ఈ కాలంలో వాడవచ్చు. పెదవులు ఎండిపోయినట్లు అనిపిస్తే లిప్‌స్టిక్ వాడకపోవడం ఉత్తమం. తేమ లేని పెదాలపై లిప్‌స్టిక్ రాస్తే మచ్చల మాదిరి అందవికారంగా కనిపిస్తుంది. పెదాలు పగిలినా, ఎండినట్లున్నా లిప్‌స్టిక్ బదులు చాప్‌స్టిక్ వాడవచ్చు. అయితే దీన్ని స్టిక్‌తో కాకుండా, చేతివేళ్ళతో రాసుకోవడం మంచిది. చలిగాలిలో బయటకు వెళ్ళేవారు సన్‌స్క్రీన్ ఉన్న లిప్‌స్టిక్‌ను ఉపయోగిస్తే పెదాల అందం బాగుంటుంది. నాణ్యమైన మాయిశ్చరైజర్లు, క్రీమ్‌లు, వెన్న, వేజలైన్, మీగడ, లిప్‌బామ్ వంటివి ఉపయోగిస్తూంటే పెదాలు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి.

-కె.నిర్మల