Others

గ్రీన్ టీతో చర్మం మిలమిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానసికోల్లాసానికే కాదు, గ్రీన్ టీని సౌందర్య సాధనంగానూ ఉపయోగిస్తే చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. ప్యాకెట్లలో లభించే గ్రీన్ టీ ఆకులను ముద్దగా చేసుకుని ‘ఫేస్‌ప్యాక్’ వేసుకుంటే ముఖచర్మం కాంతివంతమవుతుందని ప్రఖ్యాత మోడల్ మిరందా కెర్ తన సౌందర్య రహస్యాలను వివరిస్తోంది. వేడినీళ్లలో గ్రీన్ టీ ఆకులను వేసి స్నానం చేస్తే శరీరం కొత్తఅందాలతో మిలమిలలాడుతుందని ఆమె భరోసా ఇస్తోంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున గ్రీన్ టీ చర్మ సంరక్షణకు ఎంతగానో దోహదపడుతుంది. చర్మంపై మంటగా ఉన్నా, ముడతలు పడుతున్నట్లు అనిపించినా దీని ఆకులను ముద్దగా చేసి శరీరానికి రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది. శీతాకాలంలో చర్మం పొడి బారడం అనే సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. శరీరం మృదుత్వాన్ని పొంది సువాసనాభరితంగా ఉంటుంది.
గ్రీన్ టీ మిశ్రమాన్ని మనం ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. వెడల్పాటి పాత్రలో నాలుగు కప్పుల నీటిని బాగా మరిగించి అందులో గుప్పెడు గ్రీన్ టీ ఆకులను లేదా మూడు చిన్న ప్యాకెట్ల గ్రీన్ టీ పొడిని గానీ వేసి బాగా కలపాలి.
పావుగంట తర్వాత నీటిని తీసివేసి ముద్దలా చేసుకోవాలి. శరీరాన్ని నీటితో తుడుచుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి, పావుగంట తర్వాత చన్నీళ్లతో స్నానం చేయాలి. ఇదే మిశ్రమంలో మెత్తటి పంచదార, కాస్త కోల్డ్‌క్రీమ్ కలిపి ‘ఫేస్‌ప్యాక్’ వేసుకోవచ్చు. రెండు కప్పుల నీటిని బాగా మరగబెట్టి అందులో గ్రీన్ టీ ఆకులు లేదా పొడి వేయాలి. చల్లారాక ఆ నీటిలో కాస్త నిమ్మరసం, తేనె, విటమిన్-ఇ ఆయిల్, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గాజుసీసాలో వేసుకుని రెండురోజులకోసారి వాడొచ్చు. దీన్ని ముఖం, మెడ, చేతులు, కాళ్లకు రాసుకుంటే మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.