సబ్ ఫీచర్

మోడలింగ్‌లో మేమేం తక్కువ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉన్నత చదువులు, ప్రభుత్వోద్యోగాల్లోనే కాదు.. నటన, మోడలింగ్ వంటి కళారంగాల్లోనూ తామేమీ తక్కువ కాదని లింగమార్పిడి చేయించుకున్నవారు నిరూపిస్తున్నారు. ‘హిజ్రాల’ పేరిట సమాజంలో నిరాదరణకు, అపహాస్యానికి గురవుతున్న వీరు ఆత్మవిశ్వాసంతో తమకు నచ్చిన రంగంలో దూసుకుపోతున్నారు. ‘మూడో తరగతి పౌరులు’గా ముద్రపడిన వీరు ఓ వైపు సమాన హక్కుల కోసం ఉద్యమిస్తూనే తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ‘హిజ్రాల’కు మోడలింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు దిల్లీ నగరంలో ఓ సంస్థ ఏర్పాటైంది. లింగమార్పిడి చేయించుకున్న వారి హక్కుల కోసం ఉద్యమిస్తున్న రుద్రాణి చెత్రి దీన్ని ఏర్పాటు చేసి మోడలింగ్‌లో మెళకువలను నేర్పుతున్నారు. మోడలింగ్‌ను వృత్తిగా చేసుకునేందుకు 70 మంది హిజ్రాలు ముందుకు రావడం తనకు విస్మయం కలిగించిందని రుద్రాణి చెబుతున్నారు. మోడలింగ్‌పై ఆసక్తి ఉన్న వీరంతా ‘ఆన్‌లైన్’ ద్వారా దరఖాస్తులను పంపారు. శిక్షణ పొందుతున్న వారిలో అయిదుగురిని ఓ ప్రఖ్యాత ప్యాషన్ మ్యాగజైన్ ‘్ఫటో షూట్’ కోసం ఎంపిక చేసింది. సామాజిక వివక్షకు గురయ్యే హిజ్రాలను జన జీవన స్రవంతిలో చేర్చేందుకు ప్రత్యేకించి మోడలింగ్ సంస్థను ఏర్పాటు చేశామని, ఎవరిపైనా ఆధారపడకుండా వారు సొంతంగా ఉపాధి పొందేలా శిక్షణ ఇస్తున్నామని రుద్రాణి అంటున్నారు. పుట్టుకతో ఏర్పడ్డ అవయవ లోపాల కారణంగా పట్టణాల్లో చాలామంది హిజ్రాలు సెక్స్ వర్కర్లతో, యాచకులతో కలిసి తిరుగుతుంటారని ఆమె గుర్తు చేస్తున్నారు. అందరిలాగే వీరు కూడా ఉన్నతంగా జీవించాలని ఆశ పడుతుంటారని, వారి కలలను సాకారం చేసేందుకు సమాజం కూడా వివక్షను విడనాడాలని రుద్రాణి చెబుతుంటారు. విదేశాలకు చెందిన ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్లు తమ మోడలింగ్ సంస్థకు వచ్చి హిజ్రాలకు ఫొటోలు తీయడం ఆనందం కలిగిస్తోందంటున్నారు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన క్రీడాకారిణి కైట్లిన్ జెనె్నర్ (అమెరికా) లింగమార్పిడి అనంతరం ‘వోగ్’ మ్యాగజైన్‌పై ముఖచిత్రంగా కనిపించడం హిజ్రాలకు ఎంతో స్ఫూర్తిని కలిగించిందని రుద్రాణి అంటున్నారు. ప్రతిభకు ఎలాంటి సరిహద్దులు లేవని, కొత్త పోకడలకు తెరతీసే మోడలింగ్ కళ హిజ్రాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే కాదు, వారికి ఉపాధిని చూపుతుందంటున్నారు. దేశవ్యాప్తంగా హిజ్రాల్లో చైతన్యం తీసుకుని వచ్చేందుకు మోడలింగ్ కళ ఎంతగానో దోహదపడుతుందంటున్నారు. హిజ్రాలైనంత మాత్రాన అందవికారంగా ఉండాల్సిన పనిలేదని, నైపుణ్యాలకు మెరుగుపెడితే వీరు కూడా అందరిలాగే రాణిస్తారని రుద్రాణి వివరిస్తున్నారు. దిల్లీలో ఎల్‌జిబిటి ( లెస్బీయన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్) వర్గాల హక్కుల కోసం ‘మిత్ర’ పేరిట ఓ ట్రస్టును నడుపుతూ స్వచ్ఛందంగా సేవలందిస్తున్నట్లు ఆమె తెలిపారు.
మోడలింగ్‌లో ప్రతిభ చూపే అయిదుగురు హిజ్రాలను ఎంపిక చేసి వారిని ఫ్యాషన్ మీడియాకు పరిచయం చేయాలన్నదే తన ఆశయమని రుద్రాణి అంటున్నారు. ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్లు సైతం మోడలింగ్‌లో వీరి ప్రతిభను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారని ఆమె గుర్తు చేస్తున్నారు. మోడలింగ్ అనేది శరీరాకృతిపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుందని, అయితే హిజ్రాలు కూడా ఈ విషయంలో ఎవరికీ తీసిపోరని ఆమె అంటారు. శతాబ్దాల తరబడి పేరుకుపోయిన భావజాలం కారణంగా హిజ్రాలు సమాజానికి దూరమయ్యారని, వారికి సమానావకాశాలు కల్పించే తరుణం ఇపడు ఆసన్నమైందని ఆమె చెబుతున్నారు. మోడలింగ్, నటన, ఇతర కళల్లో నైపుణ్యానికే తప్ప లింగ వివక్షకు తావుండరాదని ఆమె అంటున్నారు. ఇటీవల వస్తున్న మార్పుల కారణంగా హిజ్రాలు కూడా కళాకారులుగా, కొరియోగ్రాఫర్లుగా, డిజైనర్లుగా నేడు సత్తా చాటుకుంటున్నారని ఆమె తెలిపారు. హిజ్రాల సంక్షేమానికి కృషి చేస్తున్న తమ సంస్థకు దాతల నుంచి విరాళాలు బాగానే అందుతున్నాయని ఆమె చెబుతున్నారు. లైంగిక వ్యాధుల పట్ల వీరిలో అవగాహన కలిగించేందుకు కూడా తాము కృషి చేస్తున్నామన్నారు.