సబ్ ఫీచర్

మహిళలు మెచ్చేదే నిజమైన బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ఆర్థికమంత్రి వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారంటే చాలు అన్ని వర్గాల్లోనూ ఒకటే ఉత్కంఠ.. పన్నుల భారం పడకూడదని, రాయితీల జల్లు కురవాలని అన్ని వర్గాల్లోనూ ఒకటే ఎదురుచూపులు.. సమాజంలో కుటుంబ వ్యవస్థే కీలకం గనుక ఈసారైనా బడ్జెట్ తమకు అనుకూలంగా ఉండాలని గృహిణులు కోరుకుంటున్నారు. దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నా కుటుంబ నిర్వహణకు సంపాదన సరిపోని పరిస్థితి సర్వత్రా కనిపిస్తోంది. ముఖ్యంగా పిల్లల చదువులు భారంగా పరిణమించడంతో ఈ విషయంలో వెసులుబాటు కల్పించాలని దేశవ్యాప్తంగా మహిళలంతా కోరుకుంటున్నట్లు ‘అసోచామ్’ ( అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా) సంస్థ తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీకి కొన్ని సూచనలు చేసింది. ఈ నెల 29న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మహిళల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆ సంస్థ విజ్ఞప్తి చేసింది. మహిళలు సంతృప్తిగా ఉంటే కుటుంబాలు తద్వారా సమాజం మొత్తం ఆనందంగా ఉంటుంది. పిల్లల చదువుకు ప్రత్యేక అలవెన్స్‌ను మంజూరు చేయాలని, చిన్నారుల కోసం ‘క్రెష్’లు నిర్వహించే వారికి పన్ను రాయితీలు ఇవ్వాలని మహిళలు కోరుకుంటున్నారు. ప్రతి కుటుంబంలో కనీసం ఇద్దరు పిల్లలకు నెలకు 2,500 రూపాయల చొప్పున ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇస్తే పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో వెసులుబాటుగా ఉంటుంది. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం, దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయాల్సిరావడంతో పిల్లల సంరక్షణకు ‘క్రెష్’ల అవసరం పట్టణాల్లో నానాటికీ పెరిగిపోతోంది. ముఖ్యంగా ఉద్యోగినులు చిన్నారుల ఆలనాపాలనా చూసేందుకు తగినంత సమయం వెచ్చించలేక ‘క్రెష్’లను ఆశ్రయించక తప్పడం లేదు. ఉత్పాదక రంగంలో తమకు అవకాశాలు పెరగాలని, అదే సమయంలో కుటుంబ వ్యవస్థ సజావుగా నడిచేలా కొన్ని అలవెన్స్‌లు ఇవ్వాలని మహిళలు కోరుకుంటున్నారు. పిల్లల చదువు కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉన్నందున ప్రతి నెలా కనీసం వెయ్యి రూపాయలను ఫీజు రీయింబర్స్‌మెంటు కింద ప్రభుత్వం తమకు తిరిగి చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇంటికి దూరంగా హాస్టళ్లలో ఉండే పిల్లలకు కనీసం నెలకు 1,500 రూపాయలు ఇవ్వాలని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నట్లు ‘అసోచామ్’ తెలిపింది. ఎడ్యుకేషన్ అలవెన్స్, హాస్టల్ ఖర్చుకు సంబంధించి 1988-89 నాటి నిబంధనలను ఇప్పటికీ అమలు చేస్తున్నారని మహిళలు గుర్తు చేస్తున్నారు. అధిక ధరలు, మారిన జీవన పరిస్థితులను పరిశీలించి ఈ అలవెన్స్‌లను ఇకనైనా పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ కింద ప్రతి ఉద్యోగికి ఏడాదికి 15వేల రూపాయలు చెల్లిస్తున్నారని, దీన్ని కనీసం ఏభై వేలకు పెంచితే తమకు మేలు జరుగుతుందని ఉద్యోగినులు చెబుతున్నారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ విషయమై 17 ఏళ్ల క్రితం నాటి ఉత్తర్వులే ఇప్పటికీ అమలులో ఉన్నాయంటున్నారు. ఈ సౌకర్యాన్ని రిటైర్డు ఉద్యోగులకూ వర్తింపచేయాలని, ఈ మేరకు కొత్త బడ్జెట్‌లో ప్రతిపాదించాలని మహిళలు సూచిస్తున్నారు.