ఐడియా

అందమంత చీరలోనే ఉన్నది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చీరకట్టులో నేను నా అసలు వయసుకన్నా పెద్దదానిలా కన్పిస్తానంటారు చాలామంది. కానీ నాకు చీరలంటే చాలా ఇష్టం. మన సంప్రదాయే అని కాదుగానీ...అవి కట్టుకోవడం నాకు సరదా’ అంటోంది జాతీయనటి అవార్డు గ్రహీత విద్యాబాలన్. చీరకట్టుకోవడం మాననే మానని తెగేసి చెబుతోంది. ‘మనం ఏం కట్టుకున్నామో, ఏం కట్టుకోవాలో ఎవరో చెప్పడం, మన వేషభాషలపై వేరెవరో వ్యాఖ్యానాలు చేయడం మన సమాజంలో లోపం. నిజానికి మహిళలకు ఇలాంటి అవాంతరాలు ఎన్నో ఎదురవుతున్నాయని’ ఆందోళన వ్యక్తం చేసింది. మనవారి ఆలోచనా విధానంలో మార్పురావాలని ఆమె అంటున్నారు. మనదేశంలోని కొన్ని దేవాలయాల్లోకి మహిళలను అనుమంతిచకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు. తరతరాలుగా పాతుకుపోయిన పాతసంప్రదాయాలు, నమ్మకాలను వదిలించుకోవాలని అన్నారు. మగవారితో సమానంగా మహిళలకూ గౌరవమర్యాదలు, అవకాశాలు ఇవ్వాలని ఆమె అభిప్రాయపడ్డారు. మనదేశంలో దురదృష్టవశాత్తు కొన్ని రంగాల్లో కేవలం మగవారికే అవకాశాలు ఇస్తున్నారు, మహిళలను వెనుకకే నెట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా పద్ధతులు మారాలని, మహిళలకు మగవారిలా అన్ని అవకాశాలు కల్పించాలని ఆమె కోరారు. పాతచింతకాయ పచ్చడి సంప్రదాయాలనుంచి మనం బయటపడాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉందని ఆమె అంటోంది.