సబ్ ఫీచర్

పూలజడా!... మురిపాల జడ!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూలజడ లేని శుభకార్యం లేదు. మనసుకు ప్రశాంతతను, ఆహ్లాదాన్ని కలిగించే పూలను ఇష్టపడని వారూ ఉండరు. కళాత్మకతకు, ప్రతిభకు అద్దం పట్టే పలురకాల పూల జడలు వచ్చాయి. నిండు జడ, పాయల జడ, వంకుల జడ, పలకల జడ, చక్రాల జడ, పట్టెడు జడ, డైమండ్ జడ, పేర్ల జడ, పాము పడగ జడ, పుల్లల జడ, రెడీమేడ్ జడ వంటి ఎన్నో రకాల పూలజడలు ప్రాచుర్యం పొందాయి. ఏ రకమైన పూలజడను వేయాలో ముందుగానే నిశ్చయించుకుని పూలజడను రూపొందిస్తారు. పొడవాటి జుట్టు లేనివారి జడకు సవరం జత చేసి పూలజడ అల్లిక చేస్తారు.
ఆధునికత ఎంత వచ్చి చేరినా వేడుకలలోనూ, అలంకరణలోనూ పూలజడ స్థానం ఎప్పటికీ చెక్కుచెదరినిది. చిక్కుపడకుండా అందంగా ఉండడానికి కొన్ని వెంట్రుకలను పాయలుగా విడదీసి జడగా అల్లుతారు. జడకు రకరకాల పువ్వులతో అందాలను రూపుకడతారు. ఇప్పుడు పూలజడల్లోను ఆధునికత ఉట్టిపడుతోంది. పువ్వులతో పాటు టిష్యూ లేసులు, కుందన్ బిళ్లలు, ముత్యాలు, రతనాలు కూడా జడ ఒంపుల్లో చేరిపోతున్నాయి. ఆడపిల్ల జీవితంలో వచ్చే అతి ముఖ్యమైన సందర్భాన్ని అన్నింటిలో ఈ పూలజడలే ప్రధమ ఆకర్షణ. నట్టింట్లో పట్టుపరికిణి, పూలజడ, జడకుప్పెలు, కాలికి పట్టీలతో ఘల్లు ఘల్లున తిరుగుతు వుంటే తల్లిదండ్రులు పడే ముచ్చట చూడాల్సిందే కానీ చెప్పతరం కాదు.
రంగుల సోయగాలతో, సువాసనలు వెదజల్లే పూల జడ వేయాలంటే ంటే రెండు గంటలపాటు ఏకాగ్రతతో కష్టపడితే తప్ప అందమైన పూలజడ పూర్తికాదు. నిండు జడ, పేర్లజడ, పడగ జడ, డైమండ్ జడ, చక్రాల జడలకు ఎక్కువ సమయం పడుతుంది. ఓపిక తీరిక లేని వారు మార్కెట్‌లో లభించే రెడీమేడ్ జడలను అలంకరించుకుంటారు. బాలికలు, కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు పూల జడలంటే ఎంతో ఆసక్తి చూపుతారు. కాస్త వయసుపైబడ్డ మహిళలు పూలజడలకు బదులు పూలకొప్పుల్ని పెట్టుకునేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. పూలకొప్పును పూలముడి అని కూడా పిలుస్తారు. నిండు ముడి, నాగరం ముడి, చుట్టుపాయల ముడి, నాలుగు పాయల ముడి ప్రాచుర్యంలో ఉన్నాయి.
సంప్రదాయ తరహా పూలజడల్లో...మల్లెమొగ్గలు, కాడమల్లె, కనకాంబరాలు, మరువం..పువ్వులను మాత్రమే ఉపయోగిస్తారు. మోయడానికి కాస్త బరువు ఉంటాయి కానీ చూడడానికి అందంగా ఉంటాయి. కృత్రిమమైనవి వద్దనుకున్నవారు ఇలాంటి జడలను ఎంపిక చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో గాజులు, పూలను అందంగా ఆమర్చి జడను డిజైన్ చేస్తారు. సీమంతం, పెళ్లి వేడుకలకు ఈజడ బాగా ప్రాచుర్యం పొందింది. ఆధునిక పూలజడల్లో అడుగు భాగాన అట్టముక్కలను వాడరు. దానికోసం రావి, మర్రి, విస్తరాకులను బేస్‌గా ఎంపిక చేసుకుంటారు.
గతంలో చేమంతులు, మల్లెలు, కనకాంబరాలు, గులాబీ, లిల్లీ మొదలైన తాజాపూలతో వేసే పూలజడలు ఇప్పుడు ఆర్ట్ఫిషియల్ పూలు, పూసలు, చకీలు, వన్‌గ్రామ్ గోల్డ్ జడ బిళ్లలతో అనేకరకాలుగా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. పూలజడకు వివిధరకాల జడగంటలు జతై...అమ్మాయి అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. తాజా పూలతో వేసే పూలజడ బరువు పుత్తడి బొమ్మలకు భారం కాకుండా...లైట్‌వెయిట్ పూలజడలను సైతం తయారుచేస్తున్నారు. ముఖ్యంగా నేటి యువత పెళ్లి పీటలపై మాత్రం పూలజడతో బాపుబొమ్మలా కనువిందు చేస్తున్నారు.

-వినీతా మూర్తి