Others

అందాల కిరీటి... ఆధ్యాత్మిక సుగంధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అటు ఫ్యాషన్ ప్రపంచం, ఇటు వెండి తెరమీద వెలిగిపోతూ ఎందరో సౌందర్య పిపాసకులకు ఆరాధ్య దేవత ఆమె. అయితే ఆమెలో నిగూఢంగా దాగి ఉన్న ఆధ్యాత్మిక జిజ్ఞాస ఆమెను రంగుల ప్రపంచం నుండి సన్యాసి జీవితం వైపునకు అడుగులు వేసేలా చేసింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ మోడల్, సినీనటి బర్కా మదన్. సాధారణంగా రిటైర్మంట్ (వయసు మళ్లిన తరువాత) ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. అయితే సమాజానికి సేవ చేయడడంతోపాటు ఆధ్యాత్మికంగా ఎదగాలనే ఉద్దేశంతో బర్కామదన్ మోడల్, సినీరంగాల్లో మంచి అవకాశాలు వస్తున్న సమయంలోనే బుద్ధిస్ట్ నన్ (బౌద్ధ సన్యాసిని)గా మారింది. ప్రస్తుతం బర్కామదన్ పేరు గ్వేల్ టెన్ సమ్టేన్
1994లో ఫెమినా పత్రిక నిర్వహించిన మిస్ ఇండియా సంబరంలో ఆమె పాల్గొంది. అప్పటినుంచి మోడల్‌గా పలు అవకాశాలు వచ్చాయి. మోడల్‌గా ఉంటునే ఆమె పలు బాలీవుడ్ చిత్రాలలో నటించారు కూడా. 2012లో ఆమె కర్నాటకలోని సెరామొనస్ట్రీలో బౌద్ధ మత గురువును కలిసింది. ఒకసారి ధర్మశాలలో టిబెటన్ మత గురువు దలైలామా బోధనలు విన్నది. అప్పటినుంచి సమాజానికి ఏదైనా సేవ చేయాలనే కోరిక ఆమెలో కలిగింది. సెరా మొనస్ట్రీ నిర్వాహకుడిని ఆమె తరచు కలిసి పలు ఆధ్యాత్మిక విషయాలపై చర్చిస్తుండేది. ఆమె నటించిన ‘సుర్‌ఖాబ్’ అనే బాలీవుడ్ చిత్రం ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్న బర్కామదన్‌కు బౌద్ధసన్యాసిగా మారాలనే ఆలోచన వచ్చింది. సన్యాసినిగా మారడానికి ఆమె తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. వెంటనే సెరా మోనస్ట్రీలో సన్యాసం స్వీకరించి సన్యాసినిగానే సుర్‌ఖాబ్ చిత్రం ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. సుర్‌ఖాబ్ చిత్రం విజయవంతం అయింది. బుద్ధగయలోని మైత్రేయ స్కూల్‌లో ఆమె ఉపాధ్యాయినిగా చేరారు. బీహార్‌లో హెచ్‌ఐవి పాజిటివ్ వున్న చిన్నారులకోసం నిర్వహిస్తున్న తారా ఆర్ఫనేజ్‌లో ఆమె పనిచేస్తున్నారు.
సమాజంలో అవకాశాలు లేని పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పితే భవిష్యత్తులో వారు ప్రపంచ గతినే మార్చేస్తారనే బర్కామదన్ చెబుతారు. ఇతరులకు సహాయం చేయడం వలన కలిగే ఆనందం ఎంత సంపాదించినా కూడా రాదంటారు ఆమె. బౌద్ధ మత సన్యాసినులుగా మారడానికి పలువురు ఆసక్తితో వున్నారు. అయితే ఈ సాహిత్యం మొత్తం టిబెటన్, ఇంగ్లీషుల్లో వున్నాయి. వీటిని అందరికీ అందుబాటులో తీసుకురావడానికి మరాఠీ, హిందీ భాషలలోకి అనువదించే పనిలో ఆమె నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం మన దేశంలో టిబెటన్ ననె్నరీలు మాత్రమే ఉన్నాయి. బుద్ధిస్ట్ ననె్నరీని ఏర్పాటు చేయడానికి ఆమె సన్నాహాలు చేస్తున్నారు. ఆధ్యాత్మికంగా పెరుగుదలకు భాష, మతం అడ్డంకి కావంటారు బర్కామదన్ అలియాస్ గ్యేల్‌టెన్ సమ్టేన్. భవిష్యత్తులో ఆమె ఆధ్యాత్మికంగా మరింతగా ఎదిగి ఎందరో చిన్నారులకు విద్యాసుగంధం అబ్బేలా ప్రయత్నించాలని ఆశిద్దాం.

-పి.హైమావతి