Others
జంతుబలులను ఎదిరించిన ధీర
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నేటి ఆధునిక సమాజంలోనూ ఆచారాల పేరిట జంతుబలులు యథేచ్ఛగా సాగుతుండగా, ఈ అనాగరిక పరిస్థితులపై ఓ మహిళ ధైర్యంగా పోరాడుతూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్‌లో సంప్రదాయబద్ధంగా జరిగే ‘గడిమై’ జాతరలో జంతుబలులు ఇవ్వడం ఆనవాయితీ. ఏటా గడిమై జాతరలో వేలాది జంతువులను హతమారుస్తారు. జంతుబలిని నిలిపివేయాలంటూ చాలాకాలంగా హిమాచల్ ప్రదేశ్‌లో కొందరు ఆందోళనలు చేస్తున్నా ఎలాంటి ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తూ, జంతు సంరక్షణ కోసం పరితపిస్తున్న సోనాలీ పూరేవాల్ న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. న్యాయం కోసం ఆమె మూడేళ్లపాటు అవిశ్రాంత పోరాటం చేశారు. చివరకు హిమాచల్‌ప్రదేశ్‌లో జంతుబలులను నిషేధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
వివాహం జరిగాక కసౌలీలోని తన అత్తవారింటికి సోనాలీ వెళ్లాక జంతుబలుల గురించి తెలుసుకుని ఆందోళన చెందడం ప్రారంభించారు. చిన్నప్పటి నుంచి ఆమెకు జంతువులపై ప్రేమ ఎక్కువ. జంతువులను మానవత్వంతో ఆదరించాలని భావించి మూగజీవాల సంరక్షణ కోసం కసౌలీలో ఒక శరణాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఆ శరణాలయానికి ‘గుడ్ కర్మ’ (మంచి పని) అని పేరు పెట్టి, కుక్కలు, ఎద్దులు, బర్రెలు, ఆవులు, గాడిదలు, గొర్రెలు వంటి అనేక జంతువులకు ఆశ్రయం కల్పించారు. శరణాలయం నిర్వహణకు తగినన్ని నిధులను సమీకరించడం కష్టమని తెలిసినా ఆమె వెనుకంజ వేయలేదు. ఇంటీరియర్ డెకరేషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని జంతువుల కోసం ఖర్చు చేస్తున్నారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో ఎద్దులతో పోరాటాలు (బుల్స్ ఫైట్స్) నిర్వహించడం సర్వసాధారణం. న్యాయ పోరాటం చేసి బుల్‌ఫైట్స్‌ను నిషేధింపజేయడంలో ఆమె కృతకృత్యురాలయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌ను ‘జంతు ప్రేమికుల రాష్ట్రం’గా మార్చాలని ఆమె నిరంతరం కృషి చేస్తున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ జంతుబలులను, బుల్‌ఫైట్స్‌ను పూర్తి స్థాయిలో నిషేధించేందుకు పెద్ద ఎత్తున ఉద్యమం జరగాలని ఆమె ఆకాంక్షిస్తున్నారు.