సబ్ ఫీచర్

పూచే పూల గంధం... తులిప్ విలాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ పుష్ప విలాసం చూసి హాలెండ్ అనుకుంటున్నారా..? కానే కాదు కాశ్మీర్‌లోయలో విరగబూసిన తులిప్ అందాలు. ఆసియాలోనే అతి పెద్ద తులిప్ ఉద్యావనం ద్వారాలు తెరుచుకుని పూల ప్రియులకు ఆహ్వానం పలుకుతోంది. మన దేశ తొలి మహిళా ప్రధాని పేరుతో వెలసిన ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్‌లో డెబ్బయి రకాల పూలు వివిధ రంగులలో కనువిందు చేస్తాయి. వాస్తవానికి ఒకప్పుడు తులిప్‌కు పెట్టింది పేరు హాలెండ్ దేశం. ఇక్కడ కన్నా ఇపుడు కాశ్మీర్‌లోనే ఎక్కవ రకాలు తులిప్ పుష్పాలు పూస్తాయి. పర్సియా సిగలో పుట్టిన ఈ తులిప్ ఖండాంతరాలు దాటుకుని మాజీ ముఖ్యమంత్రి గులామ్ నబీ అజాద్ హయాంలో కాశ్మీర్‌లోకి అడుగుపెట్టింది. 2008లో ప్రారంభమైన తులిప్ ఉద్యానవనంలో ఈ ఏడాది మరో 15 ఎకరాలలో విస్తరించింది. గత అక్టోబర్-నవంబర్ నెలల మధ్య విటిని నాటుతారు. ఈ ఏడాది తులిప్ పూలు సీజన్ కంటే ముందుగానే పూచాయి. దాదాపు 40 శాతం పూలు రేకులు విప్పుకున్నాయి. మార్చి నెలాఖరునాటికి పూర్తిగా విరగబూసి పర్యాటకులను రా..రమ్మని మే నెల వరకూ ఆహ్వానిస్తుంటాయి. గత ఏడాది కాశ్మీర్‌ను వరదలు ముంచెత్తినప్పటికీ 1.2 లక్షల మంది పర్యాటకులు సందర్శించటం విశేషం.