సబ్ ఫీచర్

నలుపుపై నారీలోకం సమరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగా ఉన్నానని కుమిలిపోతున్న మహిళల్లో ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టేందుకు రెండు పదులు దాటిన ఓ యువతి సోషల్ మీడియా ద్వారా సమరభేరీ మోగించింది. ‘‘నలుపే అందం’’ అనే పేరుతో సోషల్ నెట్‌వర్క్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఈ యువతి చేస్తున్న ప్రచారంలో పాలుపంచుకునేందుకు తమిళనాడులోని సెలబ్రిటీలు సైతం ముందుకు వస్తుండటం విశేషం. ఫెయిర్‌గా ఉండే చర్మం అంటే అందరూ ఇష్టపడతారు. నల్లగా ఉంటే చిన్నచూపు చూస్తారు. సౌందర్య ఉత్పతులకు సంబంధించిన బహుళజాతి సంస్థలు దీన్ని అవకాశంగా తీసుకుని రోజుకో ఉత్తత్తిని మార్కెట్లోకి విడుదల చేసే వినియోగదారుల ఆత్మన్యూనతను క్యాష్ చేసుకుంటూ కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్నాయి.
మానసిక సౌందర్యం కంటే బాహ్య సౌందర్యమే మిన్న అనే స్థాయికి వీటి ప్రచారం వెళ్లటంతో అందంగాలేని ఆడపిల్లలు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. నలుపుగా ఉండటం వల్ల ఉద్యోగాలు రావటం లేదని, భయాన్ని పోగొట్టుకోవాలంటే కుంకుమ పువ్వు కలిపి చేసిన ఈ క్రీమ్ వాడితే మీ బాస్‌తో నిర్భయంగా మాట్లాగలరనే గ్లోబల్ ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు టెక్సాస్ యూనివర్శిటీకి చెందిన 21 సంవత్సరాల విద్యార్థి నడుంబిగించింది. నలుపుగా ఉన్నా అందంలో మీ కంటే ఏమాత్రం తీసిపోమన్నట్లు తన ఫొటోతో పాటు దక్షిణాసియాకు చెందిన తన క్లాస్‌మేట్స్ మిరుషా, యనుషా, యోగరాజ అనే అమ్మాయిల ఫొటోలను పెట్టి తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ సోషల్‌నెట్‌లో పెట్టింది. ఈ ప్రచారం సోషల్ నెట్‌వర్క్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ ప్రచారంలో ఎంతోమంది ఆకర్షితులై తమ ఫొటోలను కూడా పెట్టి ఆత్మవిశ్వాసమే తమకు ఆలంబన అని, నలుపు కానేకాదని అంటూ ట్విట్టర్ తదితర ప్రసారమాధ్యమాలలో దాదాపు వెయ్యమంది తమ ఫొటోలను పెట్టారు. అంతేకాదు ‘‘ఫెయిర్ అండ్ లలీ’’ అనే క్యాప్షన్‌కు బదులు వీరు ‘‘అన్ ఫెయిర్లీ ఆండ్ లలీ’’ అని పెట్టి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాసియాలో శరీర రంగు ఎంతో ప్రభావితం చేస్తోంది. మన జీవితాలను ప్రభావితం చేసేది శరీర రంగు కాదంటూ సౌందర్య ఉత్పత్తులపై ఛాలెంజ్ చేస్తున్నామని సోషల్ మీడియాలో ప్రచారానికి తెర లేపిన టెక్సాస్ విద్యార్థిని జోన్స్ వెల్లడించింది. తాను చదివే కాలేజీలో నల్లవిద్యార్థులపై బెలూన్స్ వదలి గేలి చేస్తారని, జనం కూడా ఎందుకు నల్లగా ఉన్నవారిని వింతగా చూస్తారో అర్థంకాదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ప్రచారం విస్తత్రంగా జరిగితే సోషల్‌మీడియాలో గేలిచేసి మాట్లాడేవారికి తమ వాదనలు కూడా వినిపిస్తామని వెల్లడించింది. *
chitram..
సోషల్ మీడియాలో పెట్టిన మిరుషా, యనుషా చిత్రాలు