సబ్ ఫీచర్

సరదాల హోలీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండుగలు కొన్ని మతపరమైనవి మరికొన్ని మతేతరమైనవి. మన దేశంలో ప్రజలందరు కలసిమెలసి జరుపుకొనే పండుగలు అనేకం ఉన్నాయి. వాటిలో హోలీ ఒకటి. కుల, మత, ధనిక ,పేద అనే బేధాలు లేకుండా ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగే హోలీ పండుగ.
‘‘హోలీ’’ సరదాల పండుగ. జీవితోత్సాహాన్ని పునరుద్ధరించే పండుగ.
‘‘ఇది హోలీ! సోదరా! ఇది హోలీ!
హోలీ తల్లి! నీకు ఆశీర్వచనాలతో
మా పిల్లలు కలకాలం మనుతూ ఉండాలి!’’
అంటూ పాటలు వినిపిస్తాయి. నేడు దీపావళీ, దసరా పండుగల వలనే మన దేశంలో హోలీ పండుగ కూడా భారతీయుల ముఖ్య పండుగలలో ఒకటి అయింది.
హోలీ పండుగ శివునికి సంబంధించినది. ఆయన పెళ్ళి ఊరేగింపునకు ప్రతి సృష్టే హోలీ పండుగ. ముఖాలకు రంగులు పూయటం, దుస్తులను రంగునీళ్ళతో తడపడం, పాటలు పాడటం, నాట్యాలు చేయడం, ఇవన్నీ కూడా శివుని గౌరవార్థం కోసం చేయడం జరుగుతుంది. హోలీకి సంబంధించిన మరొక ప్రఖ్యాతగాథ ప్రహ్లాదునికి అతని తండ్రి హిరణ్యకశుపునికి సంబంధించిన కథ.
హిరణ్యకశివునికి ‘‘హోలిక’’ అనే ఒక సోదరి ఉంది. ఆమెకు ప్రత్యేక శక్తులున్నాయి. అగ్ని ఆమెను కాల్చలేదు. ప్రహ్లాదుడుని ఒడిలో కూచోబెట్టుకుని మండుతున్న అగ్నిలో ప్రవేశించమని హిరణ్యకశిపుడు ఆజ్ఞాపించాడు. ఆమె అలాగే చేసింది. కాని ప్రహ్లాదుడు క్షేమంగా అగ్ని నుంచి బయటకు వచ్చాడు. హోలిక మాత్రం మంటలలో కాలి బూడిదైంది.
ఈ అద్భుత సంఘటన జ్ఞాపకార్థమే హోలీ పండుగ చేస్తారు. హోలీకి ఒకరోజు ముందుగానే పెద్ద కర్రలను తీసుకువచ్చి ఖాళీ స్థలంలో గుట్టలుగా వేస్తారు. హోలి రోజున రాత్రి సమయంలో ఆ కర్ర గుట్టల చుట్టూ చేరి బాజాలు వాయిస్తూ, నాట్యాలు చేస్తూ వాటికి నిప్పు పెడతారు. పిల్లలందరు ఆ మంటల చుట్టూ చేరి తిరుగుతూ...
‘‘హోలీ తల్లి నీ ఆశీస్సులు మాకు కావాలీ!
కలకాలం మేం వర్ధిల్లేలా చేయాలి!’’
అంటూ పాడుతారు. ఈ కాలిన కర్ర ముక్కలను కొందరు ఇంటికి తీసుకువెళతారు. ఎందుకంటే అవి వ్యాధులను దూరంగా ఉంచుతాయని వారి నమ్మకం. ఈ దృశ్యాల్ని మనం ఎక్కువ ఉత్తర భారతదేశంలోని ఏ పల్లెలో అయినా ఏ పట్టణంలోనైనా చూడవచ్చును. హోలీ పండుగ రోజున ప్రత్యేక వంటకాలు తయారుచేస్తారు. కాని ఏ ప్రాంతంలోనైనా హోలి పండుగ రోజున అందరు తయారుచేసే వంటకం ‘‘మాల్ఫు ఆ’’ . ఈ మిఠాయిని రొట్టెలను పంచదారలో ముంచి తయారుచేస్తారు. ఈ విధంగా హోలి పండుగ ఒక్కో ప్రాంతంతో ఒక్కో విధంగా కనుల పండుగగా జరుపుకుంటారు.

-పటాపంచుల శ్రీను