మెయిన్ ఫీచర్

బసంత ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పశ్చిమబెంగాల్‌లో హోలీని బసంత ఉత్సవం పేరుతో నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించే జానపద ఉత్సవం ఇది. శీతాకాలంలో చెట్లన్నీ పూలు, పచ్చటి ఆకులతో కళకళలాడుతుంటాయి. అలాగే పంటలు కూడా ఇళ్లకు చేరుకుంటాయి. అందుకే బసంత ఉత్సవం స్వీట్లు, రంగులు, నృత్యాల కలబోతగా నిర్వహిస్తారు. కొత్త బియ్యంతో చేసిన స్వీట్లు హోలీ రోజున బెంగాల్‌వాసులు తప్పకుండా చేస్తారు. చౌ, నట్వా లాంటి నృత్యాలు ఆడతారు. బౌల్ సంగీతకారులు సంగీత పరికరాలతో వాయిస్తుండగా స్థానిక జానపదాలు పాడుతూ యువతులు ఆనందంగా నృత్యం చేస్తారు. ప్రముఖ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ సైతం ఈ బసంత్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేవారు. ఈ ఉత్సవాన్ని తిలకించాలంటే కోల్‌కతా నుంచి ఐదారు గంటలు ప్రయాణిస్తే పురులియా అనే ప్రాంతంలో వారం రోజుల ముందు నుంచే బసంత్ ఉత్సవం కోలాహాలం కనిపిస్తోంది.