Others

అందమైన అనుభూతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాగత గీతాల్ని వినిపించకుండానే
తెలుగువారి ముంగిట్లో
వచ్చి వాలిన వసంతం
అవును మరి- అది మన అందరి- సొంతం!
తొందరపడిన కోయిల-
ముందుగా కూసిందో-
సందడి చేసే సుమ సౌరభాలు
వడి వడిగా గుబాళించాయో

చిగుళ్ళు తొడగడం మరచిన మామిళ్ళు
చిరకాల అందాలతో పలకరించాయో
ఇవేవీ తెలియని నాకు
తెలిసిందల్లా ఒక్కటే..
ఇలా వచ్చి- అలా వెళ్లిపోయే వసంతం
మనసును మురిపిస్తుందని
మరువలేని అనుభూతిని మిగులుస్తుందని
మధురమైన అనుభవాల అనుశృతిగా
మన జీవితాల్ని మైమరిపిస్తుందని!

మరువాడ భానుమూర్తి