Others

రావమ్మ విశ్వశాంతితో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ శుభములిచ్చి తెలుగిళ్ళ సిరులవిచ్చి
చైత్రమాసపు పరువాలు ధాత్రికిచ్చి
పచ్చని బతుకుల్ అందర్కి పంచి యిచ్చి
తెలుగు యిండ్లకు రావమ్మ వెలుగులిచ్చి

శిశిర రుతువు రాల్చినవన్ని చెట్లకిచ్చి
మనుషులందరికి మమత మంచి యిచ్చి
రమ్యమై నవరాగ సరాగ బాల
ద్రావిడాడపడుచువమ్మ నీవు రమ్ము

పాట గోదారి కృష్ణమ్మ వరదలాగ
మాట తెలగాణ ఆంధ్రుల మనసు వూగ
ఆత్మ పరమాత్మ నీలోన అలరారుచుండ
పూవు పూవుల రావమ్మ పుడమి మురియ

శాతవాహన రాజుల శౌర్యరీతి
వేంగి చాళుక్య చోళుల విజయగీతి
కాకతీయుల ఘనకీర్తి కదన రీతి
నీదు హొయల లయలలోన నీవు నిల్పి

ఘనమనల సంస్కృతి కళలు కనుల నిల్పి
నాటి అమరావతి ఘనత నేటి నిల్పి
తెలుగు కట్టుబొట్టులు మళ్ళి తీర్చిదిద్ది
ప్రాశ్చ సంస్కృతి వికృతులు పాతరేసి
కదిలి రావమ్మ ఉగాది క్రమరీతి

మావి చివురులు మేయంగ మత్తుగలిగి
తావి తెమ్మెర ఊగంగ దాహమేసి
పిక భ్రమరములు రాగాల పిలువ నిన్ను
ప్రకృతి పురుషుల వలపుల పాన్పు రీతి
ఓ ఉగాదమ్మ రావమ్మ ఊయలూప

నన్నయకృతులు నీలొన వనె్నలొలక
తిక్కన నుడులు నీలోన తేనెలొలుక
పోతన పలుకుల్ నీలోన పూతలలది
తెలగనార్యుని తెలుగులు తేజమీయ
ఎందరెందరో కవులిలన్ విందు జేయ
తెలుగువారింట తెలుగింక వెలుగు రీతి

తెలుగు హద్దులు వేరైన తేజమొకటె
మనల బుద్ధులు వేరైన మనము ఒకటె
అనుచు తెలుగు యింట ఉగాది హాయిగొల్ప
‘దుర్ముఖి’ సుముఖిగా నేర్పు ధర్మపథము

సతము సుఖశాంతులిచ్చెడి మతము జూపి
మనిషి మానవత్వంబుతో మసలు రీతి
విశ్వమంతయు శాంతితో విరియు రీతి
వర ఉగాదమ్మ రావమ్మ వరములీయ

-రాఘవ మాస్టారు