Others

ఉత్తేజాన్ని ఇచ్చింది...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఈ పురస్కారం నాకు ఎంతో సంతోషాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తోంది.’’దక్షిణాది బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ట్విట్టర్‌లో వ్యక్తంచేసిన మాటలు. మంగళవారంనాడు ప్రతిష్టాత్మక పురస్కారం ‘పద్మశ్రీ’ని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో స్పందిస్తూ...ప్రజలు నా కష్టాన్ని గుర్తిచినందుకు కృతజ్ఞతలు అని పేర్కొంది. ఈ పద్మశ్రీ కీర్తి నాకు ప్రత్యేకమైనదని, నా భావోద్వేగాలను మాటల్లో చెప్పలేనని పేర్కొంది. ఆర్మీ అధికారి కుమార్తె అయిన ప్రియాంక చోప్రా మాజీ ప్రపంచ సుందరి. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా 2002లో తమిళ సినిమా తమిజాన్‌తో వెండితెరకు పరిచయం అయ్యారు. బాలీవుడ్‌లో క్రిష్, డాన్ చిత్రాలతో స్టార్‌డమ్ లభించింది. ‘ఇన్ మై సిటీ’లో సంగీత ప్రియుల హృదయాలను సైతం కొల్లగొట్టింది. ముప్పయి మూడేళ్ల ప్రియాంక చోప్రాకు ఈ ఏడాది ఆరంభంలోనే అమెరికా టీవి షో ‘క్వాంటీకో’కు పీపుల్స్ ఛాయిస్ అవార్డు దక్కిన విషయం విదితమే.