మెయిన్ ఫీచర్

మేడపైన పచ్చటి వనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజుకు గంట కేటాయిస్తే చాలు ఇంటికి కావల్సిన తాజా కూరగాయలు మీ సొంతం అంటారు టెర్రస్ గార్టెన్ పెంపకం దారులు. ఇంటికి పచ్చదనం, కుటుంబ సభ్యులంతా రుచికరమైన కూరలతో భోజనం చేయవచ్చని అంటున్నారు. ఉరుకుల పరుగుల జీవనంలో మార్కెట్‌కు వెళ్లి ఎపుడో పండిన కూరగాయలు, పండ్లు తెచ్చుకొని, వాటిని ఫ్రిజ్‌లో ఉంచి రోజులు తరబడి తినే బదులు ఎపుడవసరమైతే అపుడు మొక్క నుంచి తెంచుకుని కూరలు వండుకుంటే ఆ మజానే వేరు. పట్టణాల్లో చాలామంది ఇపుడు ఈ టెర్రస్ గార్డెన్ పట్ల మక్కువ చూపిస్తున్నారు. రసాయనిక ఎరువులు చల్లి పండిన కూరగాయలు తినటం వల్ల డబ్బులు పోవటమేకాదు జబ్బులు కూడా కొనితెచ్చుకోవాల్సి వస్తోంది. ఈ బాధ లేకుండా టెర్రస్ గార్డెన్‌ను పెంచటానికి సన్నహాలు చేసుకోండి. ఇందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వటానికి ఉద్యానవన శాఖ అధికారులు మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని మరచిపోవద్దు. మేడపైన ఉండే స్థలాన్ని బట్టి ఎన్ని సిమెంట్ తొట్టెలు కావాలో అంచనా వేసుకోండి. అవసరమైతే ప్లాస్టిక్ కుండీలనైనా ఏర్పాటుచేసుకోవచ్చు. దీనికి ఖర్చు కూడా ఎంతో కాదు. ఒక్కసారి ఖర్చుపెట్టామంటే కొన్ని సంవత్సరాలు పాటు ఇంటికి కావల్సిన కూరగాయలు కొనుగోలు చేయకుండా రాబడి వస్తుంది. వంకాయలు, పచ్చిమిరపకాయలు, మునగ, సొర,క్యారెట్, పొటాటో తదితర కూరగాయలతోపాటు ఆకు కూరలు, నిమ్మ, సపోటా,సీతాఫలం వంటి పండ్ల మొక్కలను పెంచవచ్చు. కనీసం 400 స్కేర్‌ఫీట్ స్థలం ఉంటే చాలు ఈ టెర్రస్ గార్టెన్ పెంచుకోవచ్చు. కొంతమంది జామచెట్లను కూడా పెంచుతారు. కాకర, బీర వంటి తీగజాతి పాదుల కోసం కర్రలతో పందిళ్లు వేసుకోవచ్చు. ఏపుగా పెరిగిన మొక్కలను కాపాడుకునేందుకు పొలిఫిలిమ్ కప్పితే అధిక ఎండ మొక్కలపై పడదు. అంతేకాదు కోతులు తదితర జంతువులు మొక్కలను పాడుచేయకుండా చేప వలలు కడితే సరిపోతుంది. వేప పిండి, టీ డికాషన్, వంటింటి వ్యర్థాలు, రాలిన ఆకులు, కొద్దిపాటి ఆవుపేడను కలిపి కుళ్లబెట్టి మొక్కలకు ఎరువుగా వాడితే ఎంతో మంచిది. వేపనూనెను నీటిలో కలిపి చల్లితే పేనుబంక, పిండినల్లి పట్టదు. వంటనూనె రాసిన అట్టలను మొక్కల వద్ద వేలాడదీస్తే రసం పీల్చే పురుగుల బెడదను నివారించుకోవచ్చు. ప్రతి నాలుగు నెలలకొకసారి కుండీల్లోని పావు వంతు మట్టిని తీసి కొత్త మట్టి మిశ్రమాన్ని కలిపితే మొక్కలు ఏపుగా పెరుగుతాయి. రోజుకు ఒక గంట కేటాయిస్తే చాలు పెరుగుతున్న ఖర్చును నివారించుకోవటమే కాకుండా కుటుంబ సభ్యులకు ఆరోగ్యకరమైన కూరగాయలను, పండ్లను సమృద్ధిగా అందించవచ్చు.