సబ్ ఫీచర్

డిజిటల్ పాఠాలు.. సాధికారతకు బాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ వ్యాప్తంగా ఎన్‌డిఎల్‌ఎం ప్రోగ్రామ్ ద్వారా 3,17,804
మంది శిక్షణ పొందారు.
ఇది 1191 సెంటర్లను ఏర్పాటు చేయగా.. నాస్కామ్ ఫౌండేషన్ సాయంతో డిజిటల్ పాఠాలు నేర్చుకున్న గృహిణులు నేడు అభివృద్ధిపథంలో పయనిస్తున్నారు. 2022నాటికి దేశం వ్యాప్తంగా
250 మిలియన్ మహిళలకు ఈ డిజిటల్ పాఠాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది.
దేశవ్యాప్తంగా 87 సెంటర్లు నడుపుతోంది. త్వరలో ఈ సెంటర్లను వందకు పెంచి మహిళలను ఆధునిక టెక్నాలజీలో భాగస్వామ్యులను చేసేందుకు కృషి చేస్తోంది.

ఓ ఐఐటీ విద్యార్థికి సాంకేతిక రంగం గురించి క్షుణ్ణంగా తెలుస్తోంది. ఎక్సెల్, యాప్స్, ఓర్డ్ తదితర వాటిని ఎలా ఉపయోగించాలో మరొకరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే అమ్మకు వీటి గురించి ఏమీ తెలియదు.కేవలం పిల్లలు అడిగే సాధారణ ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇవ్వగలదు. అలాగే జీవిత పాఠాలను నేర్పగలదు. కాని ఇది ఆధునిక సాంకేతిక యుగం. తెల్లారితే చేతిలో సెల్‌ఫోన్, అందులో యాప్ కనెక్షన్, చిటికెలో పనులు జరిగిపోతున్నాయి. వీటికి సంబంధించిన ప్రశ్నలు చిన్నారులు వేస్తే ఆ అమ్మ దగ్గర సమాధానం ఉండదు. నేడు పిల్లలకు, తల్లికి మధ్య అనుబంధంతో పాటు ఆధునిక టెక్నాలజీ కూడా వారధి వలే పనిచేస్తున్న నేపధ్యంలో సాధారణ గృహిణీలకు ఈ టెక్నాలజీని దరిచేర్చేందుకు నేషనల్ డిజిటల్ లిట్రసీ మిషన్, నాస్కామ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమం అతివలకు ఎంతో మేలు చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుర్గావ్‌లో ఎన్‌డిఎల్‌ఎమ్ సెంటర్‌లో ఆధునిక టెక్నాలజీని అం దిపుచ్చుకుని అడుగుముందుకువేస్తున్న అతివలు ఎంతోమంది. గత ఏడాది సెప్టెంబర్‌లో 20-25 మంది గృహిణిలతో ప్రారంభమైన ఈ సెంటర్‌లో ఇద్దరు యువ ట్రైనర్స్ ఇచ్చే శిక్షణలోఅమ్మలు రాటుదేలుతున్నారు. పిల్లల్ని స్కూళ్లకు పంపేసి ఇంటి పనులను చక్కబెట్టుకుని వచ్చే మహిళలతో ఈ శిక్షణాకేంద్రం కళకళలాడుతోంది. ఈమెయిల్ ఎకౌంట్ ఎలా మెయింటెన్ చేయాలి. ఫేస్‌బుక్, వాట్సప్, ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించటం, ఓర్డ్ టెక్ట్స్‌ను వినియోగించటం తదితర వాటి పట్ల వారికి ప్రాధమిక అవగాహన కల్పిస్తారు. చదువురాని తల్లులు సైతం వాట్సప్ , ఫేస్‌బుక్ వినియోగిస్తున్నారు. కొంతమంది యువ గృహిణిలు ఈ టెక్నాలజీతో ఫుల్‌టైమ్ లేదా పార్ట్‌టైమ్ ఉపాధి పొందుతున్నారు.
ఇరవై ఎనిమిదేళ్ల బీబీ యాదవ్ ఇపుడు స్వతంత్రంగా జీవిస్తోంది. ఇంట్లో ఉండే ల్యాప్‌ట్యాప్‌ను ఉపయోగించుకుని జిమెయిల్ ఎకౌంట్ ఓపెన్ చేసింది. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్‌చేస్తోంది. ఆన్‌లైన్లో బిల్లులు చెల్లిస్తోంది. ఆమెకు ముగ్గురు పిల్లలు.పార్ట్‌టైమ్ జాబ్ కూడా చేస్తున్నానని ఆనందంగా చెబుతోంది.
హర్యానాలోని హిస్సార్ నుంచి గుర్గావ్ వచ్చి డిజిటల్ పాఠాలు నేర్చుకున్న సోనియా లోహియాసొంతంగా ప్లేస్కూల్ నడుపుతూ పిల్లలకు సైతం డిజిటల్ పాఠాలు నేర్పుతోంది. చత్తీస్‌గఢ్‌కు ఉమా గోస్వామి డెల్స్ ఫ్రంట్ ఆఫీసులో ఉద్యోగం సంపాదించి తన కుటుంబాన్ని పోషిస్తోంది.