ఐడియా

చలికాలంలో చర్మ సౌందర్యం అభ్యంగన స్నానమే శ్రేష్ఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలికాలంలో సౌందర్యం ఇనుమడించేలా ఆరోగ్యంగా ఉండాలంటే అభ్యంగన స్నానం ఆచరించక తప్పదు. అభ్యంగన స్నానం తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయమే. అయినా, ఆసక్తి తరిగిపోవడానికి కారణం సమయం సరిపోడకనో! నివాస స్థలంలో వీలు పడకనో! చర్మ సౌందర్యానికి ఎంతో ఖర్చుతో కూడుకున్న కాస్మొటిక్స్ వాడి సైడ్ ఎఫెక్ట్స్ చేతులారా కొనితెచ్చుకునే బదులు సహజమైన అభ్యంగనస్నానం చేయడం మంచిది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. వెన్న, కొబ్బరినూనె, ఆవనూనె, నువ్వుల నూనె, ఆముదం ఏదైనా ఒక తైలంతో వంటి నిండా ముందుగా మర్దన చేయాలి. వెనుక వీపు ప్రాంతంలో మొదలిడి భుజాలు, మెడ, కడుపు భాగం మసాజ్ చేస్తూ చివరగా కాళ్ళు చేతులు ముఖానికి చేరుకోవాలి. గర్భం దాల్చిన మహిళలు, చర్మం కాలిన, జ్వరంతో బాధపడుతున్నవారు, గుండె సంబంధిత రోగులకు మసాజ్ విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. అభ్యంగన స్నానం నిస్సందేహంగా సరియైన రక్తప్రసరణకు, చెమటతో సహా మలినాల విడుదలకు, పలు చర్మవ్యాధుల విముక్తికి- అలాగే మానసికోల్లాసానికి దోహదకారి.
నూనె ఒళ్లంతా పట్టించాక పదిహేను నిమిషాలపాటు విశ్రాంతి తీసుకుని గోరువెచ్చని నీళ్ళతో స్నానం చెయ్యాలి. అలా స్నానం తంతు అరగంటకు మించకుండా చూసుకోవాలి. స్నానానికి ఘాటైన కార్బోలిక్ యాసిడ్‌తో కూడిన సబ్బులను వాడకూడదు. మైల్డ్ లక్షణం కలవి, గ్లిజరిన్ ఉన్నవి వాడుకోవాలి. జుట్టుకు శీకాయ్, కుంకుడు కాయల రసం వినియోగించడమే మంచిది. సబ్బులకు ప్రత్యామ్నాయంగా సున్నిపిండిని ప్రయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఒళ్ళంతా సున్నిపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేస్తే చర్మం పట్టులా కాంతివంతంగా మారుతుంది. ఛాయ తక్కువగా ఉన్నవారు నెల రోజులపాటు ఇలా చేస్తే నమ్మలేనంతగా మారతారు. మూసుకుపోయిన చర్మ గ్రంథులు శుభ్రపడి మలిన పదార్థాలు, చెమట సరిగా వెలువడతాయి. ఇక చర్మవ్యాధులు దరిచేసే అవకాశం వుండదు.
చలికాలంలో ఎప్పటికప్పుడు గోళ్ళు సరిపడా కత్తిరించుకుని శుభ్రం చేసుకుని రోజూ నూనెతో మర్దనా చేస్తుంటే ఆరోగ్యంగా వుంటాయి. స్నానానంతరం తెల్లని మెత్తని తుండుతో పూర్తిగా తడి ఆరేలా తుడుచుకోవాలి. ఖద్దరు వస్త్రాలు- ఇతర నేత వస్త్రాలు చలికాలంలో ధరించడం శ్రేయస్కరం. అభ్యంగన స్నానానంతరం అరగంట వరకు ఘన పదార్థలను ఆహారంగా తీసుకోకూడదు. పాలు, పండ్ల రసాల లాంటి ద్రవ పదార్థాలు తాగడం మంచిది. ఉదయం సురక్షితమైన స్నానం ముగించాక కాసేపు ఎండలో గడుపుతూ శీతాకాలమంతా ఎంతో సౌఖ్యంగా ఉండచ్చు.
..........................................
సౌందర్యపోషణకు ఉపకరించే సున్నిపిండిని తయారుచేసుకోవడానికి పెసరపప్పుని సునిమెత్తగా పిండి చేసి అందులో కొంచెంగా పసుపును, సువాసననలు వెదజల్లడానికి ఎండు ఖర్జూరాల పొడిని కలుపుకోవాలి. కస్తూరి, పన్నీరులను కూడా పరిమళాలు వెదజల్లడానికి వాడుకోవచ్చును. ఇలా చేస్తే చర్మ సౌందర్యంతోపాటు శిరోజాల సంరక్షణ కూడా సాధ్యమవుతుంది. చర్మవ్యాధులు, శిరోజాలు రాలడం, చుండ్రు బాధ తొలగిపోతుంది.

-హర్షిత