రాష్ట్రీయం

బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన చక్రపాణి, బుద్ద ప్రసాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఎ. చక్రపాణి, శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ద ప్రసాద్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఎపి విధానమండలి ప్రతినిధివర్గం 27న లక్నోలోని ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ, శాసనమండలిని సందర్శించింది. అనంతరం చక్రపాణి, మండలి బుద్ద ప్రసాద్ 28న వారణాసికి చేరుకుని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని సందర్శించినట్లు కౌన్సిల్ ప్రజాసంబంధాల అధికారి సత్యనారాయణ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బెనరస్ హిందూ విశ్వ విద్యాలయం తెలుగు శాఖాధిపతి బి. విశ్వనాథ్, పీఠాధిపతి (డీన్) ప్రొఫెసర్ కుమార్ పంకజ్, తెలుగు శాఖ అధ్యాపకులు, విద్యార్థులు చైర్మన్ చక్రపాణిని, ఉప సభాపతి మండలి బుద్ద ప్రసాద్‌ను సాదరంగా ఆహ్వానించారని, అనంతరం ఘనంగా సన్మానించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వారు అధ్యాపకుల, విద్యార్థులతో కొంత సేపు చర్చించినట్లు వివరించారు. (చిత్రం) ఏపి కౌన్సిల్ చైర్మన్ చక్రపాణిని, అసెంబ్లీ ఉప సభాపతి మండలి బుద్ద ప్రసాద్‌ను సన్మానిస్తున్న బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతి విశ్వనాథ్, పీఠాధిపతి కుమార్ పంకజ్