ఆంధ్రప్రదేశ్‌

నాపై కేసులు చంద్రబాబు కుట్రే : భూమన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: తనపై తప్పుడు కేసులు పెట్టించి సిఎం చంద్రబాబు వేధింపులకు దిగారని మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత భూమన కరుణాకరరెడ్డి బుధవారం ఇక్కడ విలేఖరులతో అన్నారు. తుని విధ్వంసం కేసులో సిఐడి విచారణకు వరుసగా రెండోరోజు బుధవారం ఆయన హాజరయ్యారు. రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు బనాయించడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. తాను ఎలాంటి తప్పుడు పనులు చేయలేదని, కుట్రపూరితంగా తుని విధ్వంసం కేసులో తనను ఇరికించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కాపుల న్యాయమైన డిమాండ్లను తీర్చడానికి బదులు ఉద్యమకారులను చంద్రబాబు సర్కారు వేధిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజల కోసం తాను ఎలాంటి ఇక్కట్లనైనా ఎదుర్కొనడానికి సిద్ధమేనన్నారు.