జాతీయ వార్తలు

బీహార్‌లో ప్రబలిన డెంగీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బీహార్ రాష్ట్రం జ్వరాలతో అల్లాడుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో బీహార్ వాసులు అల్లాడిపోయారు. వర్షాలు కాస్తంత తెరపిచ్చిని తరువాత ఇక్కడ డెంగీ, చికున్ గున్యా వంటి జ్వరాలు ప్రబలాయని వైద్యులు జరిపిన రక్త పరీక్షల్లో వెల్లడైంది. దీంతో బీహార్ సీఎం నితీష్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ సైతం ఆసుపత్రిని సందర్శించి రోగులు పరామర్శించారు. వైద్యుల నుంచి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బీహార్ రాజధాని లోనే 1410 మందికి డెంగీ జ్వరాలు వచ్చాయి. పరిసర ప్రాంతాల్లో 150 మందికి చికున్ గున్యా జ్వరాలు వచ్చాయి.