బికినీతో రెడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో సంచలన తారగా గుర్తింపు తెచ్చుకుని, గ్లామర్‌తో ఆకట్టుకున్న నేహాధూపియాకు ఈమధ్య కెరీర్ బాగా వెనకబడిపోయింది. ఇప్పటికే హీరోయిన్ల మధ్య గట్టి పోటీ వుండడంతో ఈ బామకు అవకాశాలు కూడా దక్కడంలేదు. అప్పట్లో ‘జూలీ’ సినిమాతో అందాలు ఆరబోసి సంచలనం సృష్టించిన నేహా చాలాకాలంపాటు బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా కొనసాగింది. ఇప్పుడు అవకాశాలు తగ్గడంతో మళ్లీ తన ఉనికిని చాటుకునేందుకు తెగప్రయత్నాలు చేస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఈమె గ్లామర్‌నే నమ్ముకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈమె నటిస్తున్న ‘శాంటా బాంటా ప్రైవేట్ లిమిటెడ్’ చిత్రం షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. ఈ సినిమాలో కూడా బికినీ అందాలతో రెచ్చగొట్టడానికి రెడీ అయ్యింది. ఈ సినిమాకోసం తను వేసుకోవాల్సిన బికినీకోసం షాపులన్నీ తిరిగి తనే కొనుక్కుందట. మొత్తానికి ఈ సినిమాపై గట్టి నమ్మకమే పెట్టుకుంది నేహా.