కృష్ణ

వచ్చే మంత్రివర్గ సమావేశంలో ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 3: వచ్చే మంత్రివర్గ సమావేశంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను అనుమతించే బిల్లును ఆమోదించడం జరుగుతుందని, దీన్ని ఆపై వచ్చే శాసనసభ సమావేశాల్లో చట్టంగా తీసుకురాగలమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ బిల్లుపై చర్చించేందుకు గాను ఆయన గురువారం ఒక హోటల్‌లో శాసనమండలిలో ఉపాధ్యాయ నియోజకవర్గ సభ్యులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో రాష్ట్రానికి ఏడు కేంద్ర విద్యాసంస్థలు రావాల్సి వుండగా ప్రస్తుతం ఐదు వచ్చాయని అన్నారు. మిగిలిన రెండు త్వరలోనే రాగలవన్నారు. రాజమండ్రిలో ఏర్పాటుచేయలదలచిన పెట్రో యూనివర్సిటీని విశాఖకు తరలించబోతున్నామన్నారు. గిరిజనుల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం రాగలదన్నారు. రాష్ట్రాన్ని ప్రత్యేక హబ్‌గా మార్చాలనేది ముఖ్యమంత్రి లక్ష్యంగా చెప్పారు. ఈ బిల్లు వలన ప్రస్తుతం వున్న ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు ఎలాంటి ఇబ్బంది రాబోదన్నారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎల్.వేణుగోపాలరెడ్డి, శాసనమండలి సభ్యులు ఎఎస్ రామకృష్ణ, కె.రవికిరణ్, బాలసుబ్రమణ్యం, బొడ్డు వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

అన్నదాన పథకానికి 10లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి, డిసెంబర్ 3: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అఖిలాండ కోటి బ్రహ్మండ నాయికి శ్రీకనకదుర్గమ్మ సన్నిధిలో నిత్యం భక్తులకు అమలు చేస్తున్న నిత్యాన్నదాన పథకానికి గురువారం చందన బ్రదర్స్ సంస్థ (విశాఖ పట్నం) వారు 10లక్షల విరాళాన్ని దేవస్థానం ఇవో సిహెచ్ నరసింగరావుకు అందజేశారు. అమ్మవారి సన్నిధిలో ని త్యం భక్తులకు అమలు చేస్తున్న నిత్యాన్నదాన పథకంలో మరికొంతమంది భక్తులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా చందన బ్రదర్స్ సంస్థ వారు ఈ పథకానికి ఈనగదును అందజేశారు. ఈసందర్భంగా ఆలయ ఇవో ఆదేశాల మేరకు చందన్ బ్రదర్స్ సంస్థ ప్రతినిధులను అంతరాయంలోనికి తీసుకువెళ్లి ప్రత్యేక దర్శనం చేయించి అర్చకుల చేత వారికి దివ్య ఆశీస్సులు ఇప్పించి ప్రత్యేక ప్రసాదాలను అందజేశారు.

మందలించానే కానీ.. దుర్బాషలాడలేదు!
విజయవాడ , డిసెంబర్ 3: విఎంసి పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులలో మెరుగైన ఉత్తీర్ణత సాధించేందుకు విస్తృత చర్యలు తీసుకొంటున్నానని, ఈ నేపథ్యంలో గతంలో జరిపిన మాదిరిగానే ప్రస్తుతం కూడా ఉపాధ్యాయుల విద్యా బోధన, పరీక్షా ఫలితాల పరిశీలనలో భాగంగా ఎకెటిపి ఎంసి హైస్కూల్ ఉపాధ్యాయుల తీరు నచ్చక వారిని మందలించానే కానీ ఎవరినీ పరుషపదజాలంతో దుర్బాషలాడలేదని విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన ఇటీవల జరిగిన క్వార్టర్లీ పరీక్షలలో వచ్చిన మార్కుల గ్రేడ్‌లపై వివరణ ఇస్తూ తెలుగులో 71 మంది డి గ్రేడ్, 16మంది ఇ గ్రేడ్, హిందీలో 70 మంది డి గ్రేడ్, 8 మంది ఇ గ్రేడ్, ఇంగ్లీష్‌లో 77 మంది డి గ్రేడ్, 26 మంది ఇ గ్రేడ్, మ్యాథ్స్‌లో 77 మంది డి గ్రేడ్, 27మంది ఇ గ్రేడ్, ఫిజికల్ సైన్స్‌లో 87 మంది డిగ్రేడ్, 41 మంది ఇ గ్రేడ్, బయాలజీలో 86 మంది డి గ్రేడ్, 16 మంది ఇ గ్రేడ్, సోషల్‌లో 86 మంది డి, 12 మంది ఇగ్రేడ్‌లతో తక్కువ మార్కులు వచ్చిన వైనంపై ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులపై అసంతృప్తి వ్యక్తం చేసానని, విద్యార్థుల విద్యా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బోధన నిర్వహించాలని కోరుతూ మందలించానే కానీ దుర్బాషలాడలేదని పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులను సైతం తాను నగదు బహుమానాలతో ప్రోత్సహించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్న ఉద్దేశంతోనే విస్తృత చర్యలు తీసుకొంటున్నట్టు వివరించారు.

చేనేత ద్వారానే దేశానికి ఖ్యాతి
చల్లపల్లి, డిసెంబర్ 3: దేశానికి చేనేత పరిశ్రమ ద్వారా ఖ్యాతి లభించిందని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. స్థానిక చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో గురువారం చల్లపల్లి చేనేత క్లస్టర్ పరిధిలోని నాలుగు గ్రామాలకు చెందిన 222 మంది చేనేత కార్మికులకు రూ.15.13 లక్షల విలువైన మగ్గం, చైన్ డాబి పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఒకప్పుడు చేనేత వస్త్రాలను విదేశాలకు ఎగుమతి చేసేవారని, అగ్గిపెట్టెలో పట్టే చేనేత చీరను తయారుచేసిన ఘనత మనదేనన్నారు. విదేశీ, మిల్లు వస్త్రాలను విసర్జించాలనే నిర్ణయం ద్వారా మహాత్మా గాంధీ చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చారని గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించి ఖద్దరు వస్త్రాలను ధరించాలని పిలుపునివ్వడం అభినందనీయమన్నారు. చల్లపల్లి మండలంలో 97 మంది చేనేత కార్మికులకు రూ.16.78 లక్షల రుణమాఫీ జరిగిందని ఆయన వివరించారు. చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు సిహెచ్ లక్ష్మణరావు మాట్లాడుతూ రుణమాఫీ పథకం కింద జిల్లాలో 1251 మంది రూ.25 6.73 లక్షలు మాఫీ జరిగినట్లు తెలిపారు. చేనేత సహకార సంఘాల నగదు పరపతిపై పావలా వడ్డీ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎంపిపి యార్లగడ్డ సోమశేఖర ప్రసాద్, జెడ్పీటిసి కృష్ణకుమారి, వీవర్స్ సంఘ నాయకులు యడ్ల నారాయణరావు, కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు బళ్ళ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

వికలాంగుల సమస్యలను
సిఎం దృష్టికి తీసుకెళతా..
* మంత్రి రవీంద్ర
మచిలీపట్నం, డిసెంబర్ 3: వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు వికలాంగులు గురువారం స్థానిక ఆర్ అండ్ బి అతిథిగృహంలో మంత్రిని కలిసి తమ సమస్యలను వివరించారు. వికలాంగులపై జరిగే దాడుల నిరోధ చట్టం పూర్తిగా అమలుపర్చాలని, వికలాంగుల హక్కుల చట్టం 1995ను అమలుచేయాలని, వికలాంగుల ఖాళీ పోస్టులను వెంటనే భర్తీచేయాలని, వికలాంగులకు ఇచ్చే అలవెన్స్ రూ.3వేల నుండి రూ.5వేలకు పెంచాలని, అన్నివర్గాల వికలాంగులకు మోటారు వెహికల్స్ కొనుగోలుకు రుణాలు మంజూరు చేయాలని, ఉద్యోగం చేస్తున్న వారికి వారు కోరుకున్న ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఎస్‌సి, ఎస్‌టిలకు అమలు పరుస్తున్న ప్రమోషన్ విధానాన్ని తమకు కూడా రిజర్వేషన్ మూడు శాతం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వికలాంగ ఉద్యోగుల సంఘం కోశాధికారి గోపీకృష్ణ, వి శ్రీనివాస్, కె పాండురంగారావు, సంఘ నాయకులు ఆంజనేయులు, వీరాంజనేయులు, బాషా, అబ్దుల్ షరీఫ్, వీరబాబు, పాండు రంగారావు, శివ, తదితరులు పాల్గొన్నారు.

కొండంగి ఎత్తిపోతల పథకం పరిశీలన
కలిదిండి, డిసెంబర్ 3: మండల పరిధిలోని కొండంగి లాకుల వద్ద ఉప్పుటేరు నీటిని తరలించేందుకు ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాన్ని గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుమారు రూ.60లక్షలతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకానికి తనవంతు సాయం అందిస్తానన్నారు. విద్యుత్ మోటార్లకు అయ్యే ఖర్చు, విద్యుత్ బిల్లును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఎగువ నుండి నీరు రాని సమయాల్లో ఉప్పుటేరు నీరు ఉపయోగపడుతుందన్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తయితే నీటి కొరత ఉండదన్నారు. ఈ ఎత్తిపోతల పథకానికి సహకరించిన ఇరిగేషన్, విద్యుత్ శాఖాధికారులను మంత్రి కామినేని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్, మండల టిడిపి అధ్యక్షులు కోకల జోగిరాజు, ఎంపిపి బండి లక్ష్మి, జెడ్పీటిసి నున్న రమాదేవి, టిడిపి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వల్లభనేని శ్రీనివాస చౌదరి, బిజెపి నాయకులు నంబూరి నాగబాబు, మార్కెట్ యార్డు చైర్మన్ తాడినాడ బాబు, డిసి చైర్మన్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలకు విస్తృత ప్రచారం
* కార్యకర్తలకు మంత్రి
ప్రత్తిపాటి పిలుపు
హనుమాన్ జంక్షన్, డిసెంబర్ 3: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలుగుదేశం కార్యకర్తలు గ్రామగ్రామాన విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. బాపులపాడు మండలం రేమల్లె గ్రామంలో గురువారం జరిగిన జనచైతన్య యాత్రలో అయన పాల్గొన్నారు. తొలుత గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాన్ని గన్నవరం శాసనసభ్యులు డా. వల్లభనేని వంశీమోహన్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన 16నెలల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు సమర్ధవంతంగా అమలు చేస్తోందన్నారు. గతంలో రూ.200 వున్న పింఛన్ నేడు ఐదురెట్లు ఇస్తున్నామని, ఇళ్లకు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు నుంచి పోలవరం కుడికాల్వ ద్వారా గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని పుల్లారావు స్పష్టం చేశారు. గన్నవరం శాసనసభ్యుడు డా. వల్లభనేని వంశీమోహన్ సేవా కార్యక్రమాలను ప్రత్తిపాటి కొనియాడారు. పాలకొల్లు శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు, డా. దాసరి వెంకట బాలవర్ధనరావు, కడియాల రాఘవరావు, ఎంపిపి తుమ్మల కోమలి, కలపాల సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ప్రతి పేదకూ ప్రభుత్వ
సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం
* జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ
గుడ్లవల్లేరు, డిసెంబర్ 3: ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అన్నారు. మండల కేంద్రం గుడ్లవల్లేరు గ్రామంలో రూ.35లక్షల వ్యయంతో చేపట్టిన సంత రోడ్డు నిర్మాణ పనులకు గురువారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా అనూరాధ మాట్లాడుతూ గ్రామాల్లో రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లా పరిషత్ మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా పెద్దఎత్తున నిధులు వెచ్చించి గ్రామాల్లో అంతర్గత రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారన్నారు. పేదలకు రేషన్ ద్వారా వివిధ పండుగలకు ఉచితంగా వివిధ నిత్యావసర వస్తువులు అందిస్తున్నట్లు ఆమె వివరించారు. గుడివాడ నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్ రావి వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు శాయన పుష్పవతి, ఎంపిపి కొసరాజు విజయ భారతి, ఎంపిడివో ఆర్ కేశవరెడ్డి, తహశీల్దార్ ఆత్మకూరి మధుసూదనరావు, టిడిపి మండల అధ్యక్షులు కొసరాజు బాపయ్య చౌదరి, వల్లభనేని బాబూరావు, తదితరులు పాల్గొన్నారు.

కుందూరి శారదా గోపాలరత్నం ట్రస్టు ఆధ్వర్యంలో
స్కాలర్‌షిప్‌లు, యూనిఫాంల పంపిణీ
మచిలీపట్నం, డిసెంబర్ 3: క్రమశిక్షణతో కూడిన విద్య ఉన్నత శిఖరాలకు తీసుకెళుతుందని ప్రముఖ వైద్యులు డా. అశ్వనీకుమార్ అన్నారు. స్థానిక లేడి యాంప్తిల్ ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థిని కీ.శే. కుందూరి శారదా పేరుతో ఏర్పాటు చేసిన కుందూరి శారదా గోపాలరత్నం ట్రస్టును గురువారం ఆయన ప్రారంభించారు. గత ఏడాది ఒకేషనల్, జనరల్ కోర్సుల్లో టాపర్స్‌గా నిలిచిన గంగాభవాని, మునీరున్నిసాలకు రూ.1500లు చొప్పున స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేశారు. అలాగే 12 మంది పేద విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శారదా కుమారి సోదరుడు డా. అశ్వనీకుమార్ మాట్లాడుతూ ఒకప్పుడు ప్రభుత్వ కళాశాలల్లో విద్యనభ్యసించిన ఎంతోమంది ఉన్నత శిఖరాలు అధిరోహించారన్నారు. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యాబోధన జరగాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దామోదర్, ట్రస్టు సభ్యులు దత్తు, రామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

ప్రజల భాగస్వామ్యంతోనే పరిపూర్ణమైన ప్రగతి
* మంత్రి దేవినేని ఉమ స్పష్టీకరణ
మైలవరం, డిసెంబర్ 3: రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్యంతోనే పరిపూర్ణమైన ప్రగతికి బాటలు వేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం మైలవరంలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతోనే అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా నీరు-చెట్టు పధకం కింద దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల విలువైన పలు సుమారు 60 కిలో మీటర్ల పొడవుగల అంతర్గత రహదారుల నిర్మాణాన్ని కేవలం 40 లక్షల రూపాయల వ్యయంతోనే నిర్మించి అందరికీ ఆదర్శంగా నిలిచినట్లు వెల్లడించారు. 13వ, 14వ ఫైనాన్స్ నిధులతో ఈరహదారుల నిర్మాణాలను చేపడుతున్నట్లు తెలిపారు. గతంలో నడవటానికి వీలు లేకుండా ఉన్న తారకరామానగర్ అంతర్గత రహదారులను చెరువు మట్టితో గ్రావెల్ రోడ్లుగా మార్చినట్లు తెలిపారు. త్వరలో ఈరహదారులను సిసి రోడ్లుగా మార్చనున్నట్లు ప్రకటించారు. దాదాపు 12కోట్ల రూపాయల వ్యయంతోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ కనకదుర్గ గుడి వద్ద ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని గత పాలకుల సాధ్యం కాని పనిని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్లైఓవర్ నిర్మాణానికి ఈనెల 5న చంద్రబాబుతో శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు. అంతేగాక విజయవాడ కనకదుర్గ గుడి నుండి ఫెర్రి వద్ద గల నదుల సంగమం వరకూ దాదాపు పాతిక కిలోమీటర్ల పొడవున కృష్ణా నదిపై పుష్కర ఘాట్‌ను నిర్మించనున్నట్లు వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిరంతర విద్యుత్ ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. దాదాపు 800 కోట్లరూపాయల వ్యయంతో పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణా నదిలో కలిపి పశ్ఛిమ కృష్ణాకు తరలించి ఎనిమిది లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తే వైసీపీ నేతలకు కళ్ళుకనిపించటం లేదని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ పట్టిసీమకు వ్యతిరేకమంటే ఒక ఎమ్మెల్యే ఏకంగా అసెంబ్లీలో పట్టిసీమ పూర్తయితే తాను రాజీనామా చేస్తానని శపధం చేశారని, వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి కావాల్సిన పట్టిసీమను అక్టోబర్ నాటికే దాదాపుగా పూర్తి చేసి గోదావరి నీటిని కృష్ణాలో కలిపిన ఘనత తమదేనన్నారు. పట్టిసీమను విమర్శించిన వైసీపీ నేతలు ఇప్పుడు లెంపలేసుకుంటారా అని ప్రశ్నించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక కుట్రలు, అరోపణలతో ఉనికికోసం తాపత్రయ పడుతున్నారని ధ్వజమెత్తారు.