బిజినెస్

లోక్‌సభకు దివాలా బిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: మెరుగైన వ్యాపార నిర్వహణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్‌లో దివాలా బిల్లును ప్రవేశపెట్టింది. పెట్టుబడుల పురోగతికి, అధిక వృద్ధిరేటుకు ఈ బిల్లు అమలు దోహదపడుతుందని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు చెబుతోంది. ఈ బిల్లును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభకు తెచ్చారు. ప్రస్తుతం దివాలా కేసుల పరిష్కారార్థం ఒక్క చట్టం కూడా స్పష్టంగా లేదు. దీంతో ఈ బిల్లు రావడం వల్ల ఆయా కంపెనీలు, భాగస్వామ్య, వ్యక్తిగత సంస్థల దివాలా తీర్మానంలో ప్రామాణికత ఉంటుందని కేంద్రం పేర్కొంటోంది.