జాతీయ వార్తలు

బీజేపీలో చేరిన ఎంపీ నీరజ్ శేఖర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి, మాజీ ప్రధాని చంద్ర శేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్ బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యదర్శులు భూపేంద్ర యాదవ్, అనిల్ జైన్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. గతంలో బలియా నియోజకవర్గం నుంచి మాజీ ప్రధాని చంద్ర శేఖర్ పోటీ చేసేవారు. ఆయనకు పోటీగా ఆనాటి ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్ సైతం పోటీ అభ్యర్థిని నిలిపివారు కాదు. మాజీ ప్రధాని మృతి తరువాత ఆయన కుమారుడు నీరజ్ శేఖర్ సమాజ్‌వాదీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకు ఈసారి ఎన్నికల్లో ఎస్పీ టిక్కెట్టు ఇవ్వలేదు. దీంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. పార్టీకి, పదవికి రాజీనామా చేసిన నీరజ్ బీజేపీలో చేరారు. ఆయనను బీజేపీ రాజ్యసభ సభ్యునిగా పంపే అవకాశం ఉంది.