తెలంగాణ

ఆత్మహత్యలు పట్టని కేసీఆర్ ఆందోళనలు చేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో రెండువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, మల్లన్నసాగర్ భూ నిర్వాసితులు ఆందోళనకు దిగినా మనస్తాపం చెందని సిఎం కెసిఆర్ ఇపుడు హైకోర్టు విభజన కోసం దిల్లీలో దీక్ష చేస్తాననడం విడ్డూరంగా ఉందని బిజెపి అధికార ప్రతినిధి రఘునందన్‌రావు విమర్శించారు. ఆయన బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, మల్లన్నసాగర్ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే హైకోర్టు విభజన వివాదాన్ని కెసిఆర్ తెరపైకి తెచ్చారన్నారు. దిల్లీలో దీక్ష ఎపుడు చేస్తారో కెసిఆర్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు ఏ ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తారన్న విషయమై బహిరంగ చర్చకు మంత్రి హరీష్‌రావు సిద్ధమైతే తాము అన్ని విషయాలను బహిర్గతం చేస్తామన్నారు.