రాష్ట్ర వార్తలు
వరంగల్, ఏప్రిల్ 20: ప్రాంతీయ పార్టీలు, ఉపప్రాంతీయ పార్టీలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదని బిజెపి జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు చెప్పారు. బిజెపికి కేంద్రంలో అధికారం ఇస్తే వందరోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుందని హామీ ఇచ్చారు. ప్రజాచైతన్య సదస్సులో భాగంగా శనివారం సాయంత్రం వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ తెలంగాణ కోసం ఒక పార్టీ ఉద్యమం చేస్తోందని టిఆర్‌ఎస్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆ పార్టీకి మెజారిటీ ఎంపి, ఎమ్మెల్యేల సీట్లు కట్టబెడితే కేంద్రంలో మరేదో పార్టీతో జతకట్టి తెలంగాణ సాధిస్తామని చెబుతోందని, కానీ జాతీయ పార్టీలతోనే ముఖ్యంగా బిజెపితోనే తెలంగాణ సాధ్యమని చెప్పారు. బిజెపితో జతకడితే మైనారిటీలు ఓట్లు వేయారని తెరాస నాయకులు చెబుతున్నారని, కానీ హిందువులందరు ఆ పార్టీకి ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ వ్యవహారిస్తోందని విమర్శించారు. కాగా బహిరంగసభకు ముందు వివిధ వర్గాలతో వెంకయ్యనాయుడు పార్టీ తరపున ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల తొలిరోజు బిల్లు ప్రతిపాదించాలని, అలా చేస్తే 23న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయినట్లేనని వెంకయ్యనాయుడు అన్నారు.
Add new comment