రాష్ట్రీయం

హైదరాబాద్ అందరిదీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైసర్గికంగా తెలంగాణకు అది ఒక అవకాశం
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు

హైదరాబాద్, డిసెంబర్ 5: హైదరాబాద్ నాలుగు వందల సంవత్సరాల గొప్ప చరిత్ర కలిగిన నగరమని, దానిని తెలంగాణ రాష్ట్రం ఒక అవకాశంగా భావించాలని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పేర్కొన్నారు. శనివారం హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని తబలా రెస్టారెంట్‌లో బిజెపి ఆధ్వర్యంలో హైదరాబాద్ నగర అభివృద్ధిపై జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శతాబ్దాల చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరం అన్ని వర్గాల ప్రజల శ్రమ ఫలితంగానే ఏర్పాటైందని అన్నారు. తెలంగాణలో హైదరాబాద్ ఒక అంతర్భాగమే అయనప్పటికీ తెలంగాణ కోసమే ఉన్న నగరంగా దానిని చూడవద్దని కోరారు. వివిధ ప్రాంతాల నుండి తెలుగురాని వారు కూడా ఈ నగరంలో ఉన్నారని, హైదరాబాద్‌ను వదిలి తెలంగాణను అభివృద్ది చేస్తానంటే కుదరదని, రోజు రోజుకు దాని ప్రాధాన్యత పెరిగిపోతుందని హైదరాబాద్ నగరాన్ని ముఖ్యమైన నగరంగా భావించి పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బిజెపి ప్రధాన పాత్ర పోషించిందని, ఉద్యమాలతో పాటు పార్లమెంట్‌లో అన్ని రాష్ట్రాల ఎంపీలతో కలిసి చేసిన తీర్మానం కూడా ప్రధానమేనన్నారు. అన్ని ప్రాంతాల ఎంపీల ఇష్ట ప్రకారమే జరిగింది కాబట్టే కొత్త రాష్ట్రం సాధ్యపడిందని స్పష్టం చేశారు. ఐటి రంగంలో బెంగళూరు తర్వాత వరుసలో హైదరాబాద్ ఉందని, 70 వేల కోట్ల ఆదాయంతో అనేక ఐటి సెక్టార్లు నెలకొల్పబడి ఉన్నట్లు చెప్పారు. ఎమ్‌ఐఎమ్‌కు దేశ వ్యాప్తంగా ఎన్నికల్లో సీట్లు పెరిగిపోవడానికి కారణం హైదరాబాద్ నగరమేనన్నారు. అన్ని పార్టీలు ఎమ్‌ఐఎమ్‌తో పోటీపడి హైదరాబాద్ నగరాన్ని ఒవైసి కాళ్లదగ్గర పెట్టాయని విమర్శించారు. కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీలు జేబు పార్టీలుగా మారి ఏనాడు ఎమ్‌ఐఎమ్‌కు వ్యతిరేకంగా మాట్లాడరన్నారు. ఒకప్పుడు పార్లమెంట్‌లో అధిక సీట్లు కలిగిన పార్టీలుగా కమ్యూనిస్టులు ఉన్నారని ప్రస్తుతం వారి ఉనికి ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. సీతారాం ఏచూరి ఆ పార్టీ అభివృద్ది కోసం దృష్టి సారించకుండా బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆ పార్టీల ప్రాధాన్యతను కోల్పోయే విధంగా చేసుకుంటున్నాయని దుయ్యబట్టారు. నగరంలో బీఫ్ పార్టీల ఏర్పాటుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అంబేద్కర్ ఏనాడు బీఫ్ పార్టీల ప్రస్తావన చేయలేదని, బీఫ్ పార్టీలు పెట్టినపుడు ఆవు పూజలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడి అనేక కుటుంబాలు మృతి చెందాయని, అలాంటి నిజాంను టిఆర్‌ఎస్ పొగడడం హస్యాస్పదమన్నారు. జిల్లా అధ్యక్షుడు మీసాల చంద్రయ్య మాట్లాడుతూ ప్రజలచేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్ కొనుగోలు చేస్తోందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా అమ్ముడుపోయాడని రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో ప్రజలు తగిన బుద్ది చెప్పుతారని చెప్పారు. కార్యక్రమంలో కూకట్‌పల్లి అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్‌రావు, కాంతారావు, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
** హైదరాబాద్ నగర అభివృద్ధిపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతున్న మురళీధర్ రావు