Others
చలిలో ‘బ్లాక్ టీ’ మేలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
చలిగాలుల తీవ్రత పెరిగేకొద్దీ రాత్రి సమ యం సుదీర్ఘంగా అనిపిస్తూ, పగటి పూట ఎటూ తిరగలేక చాలామంది బద్ధకంగా ఫీలవుతూ ఉంటారు. ఈ కారణంగానే చలివేళ ఉత్సాహంగా ఉండేందుకు టీ, కాఫీలు మోతాదుకు మించి సేవిస్తుంటారు. వీటికి బదులు ‘బ్లాక్ టీ’ తాగడం ఉత్తమం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యరీత్యా కాఫీ కంటే టీ మేలని చాలామంది భావిస్తారు. నిజానికి మామూలు టీ కంటే ‘బ్లాక్ టీ’ తాగడం అన్ని విధాలా మంచిది. మితంగా బ్లాక్ టీ తాగడం వల్ల చర్మ సంరక్షణ సాధ్యపడుతుంది. శిరోజాలు బలంగా, ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. మెదడులో చురుకుదనం తగ్గుతున్నట్లు (పార్కిన్‌సన్స్ వ్యాధి) అనిపిస్తే బ్లాక్ టీ తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. డయేరియా లక్షణాలున్నవారు దీన్ని తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. బ్లాక్ టీలోని శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధిస్తాయి. కడుపు, ఊపిరితిత్తులు, గర్భాశయం, రొమ్ములు, పెద్దపేగు తదితర అవయవాల్లో క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించేందుకు కూడా ఇది ఉపకరిస్తుంది. రోజూ మితంగా బ్లాక్ టీ తాగితే గుండె సంబంధ సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఆస్తమా రోగులు కూడా దీన్ని తాగడం మంచిది. అన్నింటికీ మించి మెదడు చురుగ్గా పనిచేసేందుకు, ఏకాగ్రతను పెంచేందుకు బ్లాక్ టీ దోహదపడుతుంది.