తెలంగాణ

మృతుల కుటుంబాలకు రూ.2లక్షల నష్టపరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఫిలింనగర్‌లోని కల్చరల్ క్లబ్ వద్ద నిర్మిస్తున్న భవనానికి ఎలాంటి అనుమతులు లేవని, నాసిరకం పనుల వల్లే నిర్మాణంలో ఉండగా భవనం కూలిపోయిందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆదివారం విలేఖరులకు తెలిపారు. ప్రమాదానికి కారకులపై చర్యలు తీసుకుంటామని, మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఆయన చెప్పారు. కాగా, భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తామని నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. భవన నిర్మాణానికి ఫిలిం నగర్ సొసైటీ జిహెచ్‌ఎంసి నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే శ్లాబు వేసిన 48 గంటల్లోనే భవనం కూలిపోయిందని తెలిపారు.