సంజీవని

రక్తప్రసరణ గాడి తప్పితే గుండెకు చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరీరంలో గుండెతోపాటు రక్తనాళాల ప్రాధాన్యత ఎంతో వుంది. గుండె ద్వారా ఆక్సిజన్, ఆహారంతో కూడిన రక్తం- రక్తనాళాల ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా అవుతుంటుంది. ఆక్సిజన్, ఆహారం- ఈ రక్తనాళాలలో అడ్డంకులేర్పడితే ఆ తర్వాతి భాగాలకు చేరదు. దాంతో ఆ భాగాలు దెబ్బతింటాయి.
ఒక్కో అవయవానికి ఆర్టెరీ బ్లడ్‌వెసెల్ ద్వారా ఆక్సిజన్‌తో కూడిన రక్తం చేరుతుంటుంది. వీన్ బ్లడ్ వెసెల్ ద్వారా కార్బన్‌డయాక్సైడ్ వ్యర్థాలతో కూడిన రక్తం గుండెకి వెనక్కి వస్తుంటుంది. ఆర్టెరీలో అడ్డంకులు ఏ కారణాన ఏర్పడ్డా, అది సరఫరా చేయాల్సిన అవయవానికి రక్తం అందదు. క్రమంగా ఈ అవయవ కణాలు దెబ్బతింటాయి. మిగతా అవయవాల కణాలు పునరుత్పత్తి అవుతాయిగాని, గుండె మెదడు కణాలు ఒకసారి దెబ్బతింటే మళ్లీ పునరుత్పత్తి కావు.
గుండె కండరాలకు రక్తం కరొనరి ఆర్టెరి మూడు శాఖల ద్వారా జరుగుతుంటుంది. ఈ శాఖలలో అడ్డంకులేర్పడి, రక్తసరఫరా సరిగ్గా జరగకపోవడంతో గుండె కండరాలు దెబ్బతిని ‘హార్ట్‌ఎటాక్’ వస్తుంది. దీనినే గుండెపోటు అని కూడా అంటారు. అలాగే మెదడుకి, గొంతుక భాగంలో ఇటువుండే కరొనరీ రక్తనాళాల ద్వారా రక్త సరఫరా జరుగుతుంటుంది. ఈ శాఖలలో అడ్డంకులేర్పడితే, మెదడుకి రక్తసరఫరా జరగక మెదడు కణాలు దెబ్బతినడంవల్ల ‘స్ట్రోక్’ వస్తుంది. దానినే పక్షవాతం అని కూడా అంటారు. మెదడులో ఏ ప్రాంత కణాలు దెబ్బతింటే, ఆ ప్రాంతం నిర్వహించే పనులు దెబ్బతింటాయి. సాధారణంగా ఇది శరీరానికి ఓ ప్రక్క వస్తుంటుంది.
స్ట్రోక్ రెండు రకాలు. కరొనరి ఆర్టెరీలో అడ్డంకులవల్ల వచ్చేది- ఇస్కీమిక్ స్ట్రోక్. మెదడులోని రక్తనాళాలు చిట్లడంవల్ల మెదడులో రక్తస్రావమై సంభవించేది హెరేజిక్ స్ట్రోక్.
స్ట్రోక్‌మీద అవగాహనని పెంచడానికి ఏటా అక్టోబర్ 29 నాడు ‘స్ట్రోక్ అవగాహనా దినోత్సవాన్ని’ జరుపుకుంటున్నాం.
ప్రపంచ వ్యాపితంగా స్ట్రోక్ కారణాన ఎంతోమంది ప్రాణాల్ని పోగొట్టుకుంటున్నారు. మొత్తం మరణాలలో స్ట్రోక్ కారణ మరణాలు 11 శాతం, 2010లో స్ట్రోక్ కారణంగా 17 మిలియన్ల మంది మరణించారు. 1990 నుంచి 2010 వరకు తీసుకుంటే స్ట్రోక్ మరణాలు 10 శాతం తగ్గాయి అభివృద్ధి చెందిన దేశాలలో. అభివృద్ధి చెందని దేశాల్లో ఈ మరణాలు 10 శాతం పెరిగాయి. 65 సంవత్సరాల పైబడిన వయసున్నవాళ్ళలో ముగ్గురిలో ఇద్దరు స్ట్రోక్ బారిన పడుతున్నారు. కాన్సర్, గుండెపోటు తర్వాత ఎక్కువ మరణాలు స్ట్రోక్‌వల్లే జరుగుతున్నాయని ఒక అంచనా.
స్ట్రోక్ 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళలోనే ఎక్కువగా వస్తున్నాయి. పెద్దవాళ్ళలో ఇస్కీమిక్ స్ట్రోక్ ఎక్కువగా వస్తుంటే, తక్కువ వయస్సు వాళ్ళలో హెమరేజిక్ వస్తే, వాళ్ళలో ఒక్కరు చిన్నపిల్లలు! పిల్లల్లో వచ్చే స్ట్రోక్స్‌లో 50 శాతం ఇస్కీమిక్ అయితే, 50 శాతం హేమరేజిక్! పిల్లల్లో స్ట్రోక్‌కి గుండె జబ్బులు 25 శాతం కారణం. అవయవాలు బాగా దెబ్బతిని ఇబ్బంది పెట్టే జబ్బు స్ట్రోక్. స్ట్రోక్స్ మొత్తాన్ని తీసుకుంటే కరొనరి రక్తనాళాలలో అడ్డంకులవల్ల ఏర్పడే ఇస్కీమిక్ స్ట్రోక్స్ 85 శాతం అయితే, హెమరేజిక్ కారణాన వచ్చేవి 15 శాతం. గుండె ప్రాంతంలో రక్తనాళాలలో ఏర్పడ్డ అడ్డంకి, కరొటిడ్ ఆర్టెరీలవైపు పయనించి వచ్చే ఇస్కీమిక్ హార్ట్ ఎటాక్- ఇస్కీమిక్ హార్ట్ ఎటాక్‌లలో నాల్గవంతు. అందుకని గుండె, రక్తనాళాల ఆరోగ్యం స్ట్రోక్ రాకుండా చూసుకోవడానికీ ముఖ్యం.
ప్రపంచ వ్యాపితంగా ప్రతీ సంవత్సరం దాదాపు 15 మిలియన్లమంది కొత్తగా స్ట్రోక్‌తో బాధపడుతున్నారు. ప్రపంచంలోని ప్రతీ ఆరుగురిలో ఒకరు తమ జీవితకాలంలో స్ట్రోక్‌తో బాధపడుతున్నారు. అభివృద్ధి చెందని దేశాలలో వీళ్ళలో మూడింట రెండు వంతులమంది ప్రాణాల్ని కోల్పోతున్నారు.
స్ట్రోక్ రావడానికి ముఖ్యమైన రిస్క్ ఫాక్టర్ ధూమపానం. అధిక రక్తపోటున్నవాళ్ళు ధూమపానం చేస్తుంటే ఇంకా అపాయకరం. ఎక్కువ మొత్తాలలో మద్యపానం సేవించేవాళ్ళలో కూడా ఈ రిస్క్ ఎక్కువ. డయాబెటిస్ వున్న వాళ్ళకి స్ట్రోక్ వచ్చే అవకాశం రెట్టింపు. గుండె ఒక రిథమ్ ప్రకారం కొట్టుకోనివాళ్ళకి రిస్క్ ఎక్కువ. ధూమపానం, ఆల్కహాల్ సేవనం లాంటి అలవాట్లకి దూరంగా ఉండాలి. అధిక రక్తపోటు, డయాబెటిస్ లాంటి వాటిని అదుపులో ఉంచుకోవాలి.
కొలెస్ట్రాల్ పెరగకుండా కొవ్వు లేని ఆహారాన్ని తీసుకోవాలి. పీచు పదార్థాల్ని తీసుకోవడం చాలా అవసరం. అలాగే తాజా కూరలు, పళ్ళు తినాలి. జంక్‌ఫుడ్‌ని దూరంగా ఉంచాలి. కదలికలు లేకుండా ఉండకూడదు. వ్యాయామం, ఆహారంతోపాటు చాలా అవసరం.

*