శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రక్త పరీక్షలంటూ దండుకుంటున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* పుట్టగుడుగుల్లా ప్రైవేటు ల్యాబ్‌లు
* అర్హత లేని కేంద్రాలపై చర్యలు శూన్యం
నెల్లూరు, డిసెంబర్ 18: కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, వాటికి అనుబంధంగా ఉన్న ల్యాబ్ నిర్వాహకులు రోగులను పీల్చీ పిప్పి చేస్తున్నారు. చిన్న ఆరోగ్య సమస్యతో ప్రైవేటు ఆసుపత్రికి వెళితే రోగుల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు. ధనార్జనే ధ్యేయంగా ఆరోగ్య సమస్యలపై లేనిపోని అపోహలు రేకెత్తిస్తూ అన్ని రకాల రక్త పరీక్షలు చేయిస్తూ జేబులు ఖాళీ చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న ల్యాబ్‌ల్లో పరీక్షలు చేయించుకోకపోతే వైద్యులు తిరస్కరిస్తూ వాటిలో తప్పులు లేకపోయినా తప్పులు చూపిస్తూ ఇక్కడే చేయించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ప్రైవేటు వైద్యశాలలు సూపర్ స్పెషాలిటి హాస్పటల్స్, నర్సింగ్ హోమ్‌లు 350 వరకు ఉన్నాయి. వీటిలో ఎక్కువ నెల్లూరు నగరంలో ఉన్నాయి. వీటిలో ఒకటి రెండు మినహా ఎక్కడా కూడా రక్త పరీక్షలకు సంబంధించిన పట్టికలు ఏర్పాటు చేయలేదు. కావలి, ఆత్మకూరు, గూడూరు, ఉదయగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి ప్రాంతాల్లో అధికంగా ప్రభుత్వ అనుమతులు లేని చిన్న పాటి ప్రైవేటు వైద్యశాలలు ఉన్నాయి. ఇక్కడ వైద్యుడు ఎంత చెబితే అంత అన్నట్లు జరుగుతుంది. జిల్లాలో చాలా చోట్ల అనధికారిక రక్త పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. అనుమతులు లేకపోయినా అధికారుల సహకారంతో కేంద్రాలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కేవలం నిర్వాహకులు ఆయా ల్యాబ్‌ల్లో ఆరు నెలలు మాత్రమే పనిచేసి ఇతర ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. చాలా చోట్ల సహాయకులుగా చేరిన వారే రోగ నిర్ధారణపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న ల్యాబ్‌ల్లో టెక్నీషియన్‌లకు సరైన అర్హత లేకపోయినా వైద్యులు వారివద్దే పరీక్షలు చేయిస్తూ ప్రజలను మెసం చేస్తున్నారు. ఇకనైనా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ వారిని నిలువునా దోచుకుంటున్నా ల్యాబ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే వారికి సహకరించే వైద్యులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.