బిజినెస్

సంక్షోభంలో బంగారం వ్యాపారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) ఏప్రిల్ 3: ఆంధ్రప్రదేశ్‌లో బంగారం దుకాణాల బంద్ కారణంగా సుమారు రూ.6 వేల కోట్లు స్తంభించిపోయి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినట్లు వర్తకులు ఆందోళన వ్యక్తం చేశారు. బంగారపు దుకాణాలపై కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని విధించి కొద్ది నెలల క్రితం జివో జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ‘సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని’ వెంటనే తొలగించాలని గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా బంగారపు దుకాణాలను 20రోజుల పాటు బంద్ చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో ఈ అంశంపై కమిటీని ఏర్పాటు చేసి నివేదిక వచ్చే వరకు సుంకాన్ని విధించమని చెప్పటంతో వ్యాపారస్థులు ఊపిరిపీల్చుకొని తిరిగి దుకాణాలను తెరిచి వ్యాపారాలు ప్రారంభించారు. అయితే సంబంధింత అధికారులు మాత్రం టాక్స్ చెల్లించాలని వర్తకులపై ఒత్తిడి తీసుకురావటంతో తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా రెండోసారి దుకాణాలు మూసివేసి వ్యాపారస్థులు ఆందోళనకు దిగారు. గత మంగళవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా పసిడి దుకాణాలను యజమానులు మూసివేసి బంద్ పాటిస్తున్నారు. కృష్ణాజిల్లా పరిధిలో విజయవాడ తర్వాత అంతటి మార్కెట్ ఉండి నిత్యం లక్షలాది రూపాయలు అమ్మకాలు, కొనుగోలు జరిగే జగ్గయ్యపేట, బందరులో నిరంతరం బంద్ కొనసాగుతోంది. ఇదేవిధంగా వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు. భీమవరం, కడప, ప్రొద్దుటూరు, అనంతరపురం, కావలి, కర్నూలు. గుంటూరు, నర్సారావుపేట, చీరాల, బాపట్ల, సత్తెనపల్లి, నాగార్జునసాగర్, నెల్లూరు, దర్శి, గుంతకల్లు వ్యాపార కేంద్రాల్లో కూడా వ్యాపారం నిలిచిపోయింది. కేవలం ఈ దుకాణాలపైనే ప్రత్యక్ష, పరోక్షంగా ఆధారపడినవారు తమ జీవనోపాధికి తీవ్రమైన ఆటంకం ఏర్పడటంతో ప్రస్తుతానికి వారు దొరికిన చోటల్లా అప్పులు చేసి బతుకు బండి లాగుతున్నారు.