Others

ఇటు పూజాఫలం.. అటు ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మ ఆనందబాష్ప బిందువులనుండి ఉసిరిక ఉద్భవించింది. శ్రీమహావిష్ణువుకు ధాత్రి, తులసి దళాలు ప్రియములు. ధాత్రి మూలమున శ్రీహరి, స్కంధమున రుద్రుడు, ఊర్ధ్వమున బ్రహ్మ, శాఖలందు సూర్యుడు, ఉపశాఖలందు దేవతలు ఆశ్రయించి ఉంటారట. కనుక సర్వదేవతామయమైన ధాత్రి వృక్షము కింద శ్రీహరిని నిల్పి, గంధ కంకుమాదులచే అలంకరించి, పుష్పములచే పూజించి ‘‘్ధత్రీదేవి నమస్త్భ్యుః ................ కురు సర్వదా’’ అంటూ పదకొండు ప్రదక్షిణలు చేయాలి. తులసి వృక్ష సన్నిధిలో దీప ప్రజ్వలనం చేసి ధ్యానం చేస్తూ ‘‘నమస్తులసి సర్వజ్ఞ పురుషోత్తమ వల్లభే పాహిమాం సర్వపాపేభ్య స్సర్వ సంపత్ప్రదాయిని’’ అంటూ భక్తితో పూజించాలి. శ్రీ మహావిష్ణువును ధాత్రీ వృక్ష నీడలో ఆరాధిస్తే అశ్వమేధ యాగ ఫలం లభిస్తుందట. కార్తీక మాసంలో ప్రతిరోజు లేదా పౌర్ణమి, అమావాస్య రోజులలో గాని ఉసిరి వృక్షాన్ని పూజిస్తే సర్వ శుభములు కలుగుతాయని శాస్తవ్రచనం. ఉసిరికాయలతో నివేదన, ఉసిరికాయలపై ఆవు నేతితో తడిపి వస్తులు వేసి దీపారాధన, ఉసిరిచెట్టు కింద శ్రీ మహావిష్ణువును పూజించడం, ఉసిరి వనంలో అన్నసమారాధానలు చేయడం, సాలగ్రామాలను, దీపాలను దానం చేయడం వలన అఖండ అష్టైశ్వర్య ప్రాప్తి, అనంత పుణ్యఫలం లభిస్తుంది. కార్తిక మాసంలో బంధు మిత్రులతో కలిసి ఉసిరి చెట్ల నీడలో వనభోజనాలు చేసినట్లయితే సకల పాపములు తొలగిపోయి, విష్ణులోకం పొందుతారని, కలియుగమందు ధాత్రీమాల నరుల ఎన్ని దోముములను స్పృశిస్తుందో అన్నివేల సంవత్సరములు వైకుంఠమందు వలసి లభిస్తుందని కార్తిక పురాణోక్తి. మానవుడు తన ఆరోగ్యమును కాపాడుకొనుటకై ఉసిరికాయను ఏదో ఒక రూపములో ఉపయోగించవలసిందిగా, అది సాధ్యము కాలేనిచో కనీసం ఈ కార్తికమాసమునందైనా, తప్పక ఉసిరిని ఉపయోగించాలని ధార్మికముగా నియమము చేసినారు మన మహర్షులు. ఆయుర్వేదరీత్యా ఉసిరి వలన శరీరపు ఉష్ణమును తగ్గించి, జీర్ణశక్తిని పెంపొందింపజేసి, వీర్యవృద్ధిని కలిగించి, మంచి పుష్టిని పుట్టించును. దాహమును తీర్చే, మధుమేహ రోగులకు మంచి హితకారి. ఉసిరిక త్రిదోషహరము ‘సంజీవిని’ అని పిలువబడుతున్నది. కార్తిక మాసమునందు వాతావరణ ప్రభావము నుంచి ఉష్ణాశం తక్కువై త్రిదోషములు వికృతి పొందును. కార్తిక మాసంలో మనము బృందావనమునందు ఏర్పాటుచేసికొన్న ఉసిరిక కొమ్మ-తులసి రెమ్మల వాసనలవలన చక్కటి ఆరోగ్యము చేకూరుతుందని ఈ మాసంలో వనభోజనాలు ఏర్పాటుచేసినారు మన ప్రాచీనులు. ‘‘‘యోధాత్రీఫల దినంతు పౌర్ణమ్యాంచ ............’ అని కార్తిక పురాణోక్తి. ఈ మాసములో ఉసిరికాయలు, దానం చేస్తే మహాపుణ్యప్రదం. ఈ ఉసిరి దానంచే ముక్తి కల్గడమే కాకుండా ఉసిరి పండ్లనీ, తులసిదళాన్ని కలిపిన జలముతో స్నానమాచరించినవారికి గంగా, కావేరి నదీ స్నాన ఫలం లభిస్తుందని, ఏమి చేయలేని అశక్తులైనవారు చివరికి ఒక పిడికెడు ఉప్పు (లవణం)ను నీటిలో వేసికొని స్నానమాచరించితే సముద్ర స్నానమాచరించిన పుణ్యఫలం దక్కుతుందని ధర్మశాస్త్రంలో పేర్కొనబడింది.

-రసస్రవంతి కావ్యసుధ