ఊటీలో బ్రహ్మోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు, సమంత, కాజల్, ప్రణీత హీరోహీరోయిన్లుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పి.వి.పి.సినిమా పతాకంపై పరంవి పొట్లూరి నిర్మిస్తున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర వివరాల గురించి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెలియజేస్తూ, ఇప్పటివరకూ రెండు షెడ్యూల్లు జరిగాయని, ఈనెల 28నుంచి మూడో షెడ్యూల్‌ని ఫిలిమ్ సిటీలో జరుపనున్నామని, డిసెంబర్ 10నుంచి నెలాఖరు వరకు ఊటీలో షూటింగ్ చేస్తామని అన్నారు. ఈ షెడ్యూల్‌లో చిత్రంలోని నటీనటులందరూ పాల్గొంటారు. సీతమ్మవాకిట్లో... వంటి సినిమా తర్వాత మళ్లీ మహేష్‌తో పనిచేయడం ఆనందంగా వుందని అన్నారు. నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి మాట్లాడుతూ ఒక అద్భుతమైన కథతో ఉన్నతమైన భారీ సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, మహేష్ కెరీర్‌కు, మా బ్యానర్‌కు ఇది ప్రతిష్టాత్మకమైన చిత్రంగా నిలుస్తుందని అన్నారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాన్ని రూపొందిస్తున్నారు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు, సంగీతం: మిక్కీ జె.మేయర్, డాన్స్: రాజుసుందరం, ప్రొడక్షన్ డిజైనర్: తోట తరణి, నిర్మాతలు: పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.