ఆటాపోటీ

బ్రెట్ లీ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇరు జట్లలో టాప్ బౌలర్‌గా ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీని పేర్కోవాలి. అతను 32 వనే్డల్లో 55 వికెట్లు పడగొట్టాడు. కపిల్ దేవ్ 41 మ్యాచ్‌ల్లో 45 వికెట్లు కూల్చి రెండో స్థానంలో ఉన్నాడు. 27 మ్యాచ్‌ల్లో 43 వికెట్లు పడగొట్టిన మిచెల్ జాన్సన్‌ది ఈ జాబితాలో మూడో స్థానం.
ఉదారుడు వినయ్
ఉదారంగా పరుగులిచ్చిన రికార్డు భారత ఫాస్ట్ బౌలర్ వినయ్ కుమార్‌కు దక్కుతుంది. అతను 2013 నవంబర్ 2న జరిగిన బెంగళూరు వనే్డలో ఏకంగా 102 పరుగులు సమర్పించుకున్నాడు. మెక్‌కీ 89, జవగళ్ శ్రీనాథ్ 87 పరుగులు ఇచ్చి ఈ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

రోహిత్
రికార్డు
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఒక వనే్డలో అత్యధిక స్కోరు చేసిన రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. అతను 2013 నవంబర్ 2న బెంగళూరులో 158 బంతుల్లో 209 పరుగులు చేశాడు. సచిన్ తెండూల్కర్ 2009 నవంబర్ 5న హైదరాబాద్‌లో 175 పరుగులు సాధించాడు. భారత్‌పై ఆస్ట్రేలియా తరఫున ఒక వనే్డలో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ జార్జి బెయిలీ. అతను 2013 అక్టోబర్ 30న 156 పరుగులు చేశాడు.

పరుగుల రారాజు

ఆస్ట్రేలియాపై భారత మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ అత్యధికంగా 3,077 పరుగులు చేశాడు. అతను 71 వనే్డల్లో ఈ పరుగులు సాధించగా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 59 వనే్డల్లో 2,164 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. ఆడం గిల్‌క్రిస్ట్ 1,622 (46 వనే్డలు), మాథ్యూ హేడెన్ 1,450 (28 వనే్డలు) చొప్పున పరుగులు చేశారు. కాగా, ఆస్ట్రేలియాపై వనే్డల్లో ఎక్కువ పరుగులు చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్ మహమ్మద్ అజరుద్దీన్. అతను 43 వనే్డల్లో 990 పరుగులు సాధించాడు.
అత్యధిక పరుగుల విషయంలో మొదటి రెండు స్థానాలను ఆక్రమించిన సచిన్, పాంటింగ్ అత్యధిక శతకాల అంశంలోనూ అవే స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియాపై సచిన్ 9 శతకాలు సాధించాడు. భారత్‌పై పాంటింగ్ 6 సెంచరీలు చేశాడు.
సిక్సర్ల హీరో
ఇరు జట్ల మధ్య సిక్సర్ల హీరోగా సచిన్ తెండూల్కర్‌ను పేర్కోవాలి. అతను మొత్తం 35 సిక్సర్లు కొట్టాడు. రికీ పాంటింగ్ 32, రోహిత్ శర్మ 30 సిక్సర్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. కాగా, ఒక ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఘనత రోహిత్ శర్మది. అతను 16 సిక్సర్లు సాధించగా, పాంటింగ్ ఎనిమిది సిక్సర్లతో రెండో స్థానంలో నిలిచాడు. సచిన్, పాంటింగ్, విరాట్ కోహ్లీ, మాక్స్‌వెల్ తలా ఏడేసి సిక్సర్లు నమోదు చేశారు.

ధోనీ భారీ సిక్స్
అడెలైడ్‌లో 2012 ఫిబ్రవరి 12న జరిగిన వనే్డలో ధోనీ 112 మీటర్ల దూరానికి భారీ సిక్సర్ కొట్టి ఆస్ట్రేలియాపై భారత్‌కు నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించిపెట్టాడు. డేవిడ్ హస్సీ 72, పీటర్ ఫొరెస్ట్ 66 పరుగులతో రాణించడం వల్ల ఆస్ట్రేలియా 8 వికెట్లకు 269 పరుగులు చేయగలిగింది. ఆతర్వాత లక్ష్యాన్ని ఛేదించడానికి మైదానంలోకి దిగిన భారత్‌కు రోహిత్ శర్మ (33), సురేష్ రైనా (38) భారీ స్కోర్లు అందించలేకపోయినా, రన్‌రేట్ తక్కువ కాకుండా జాగ్రత్త పడ్డారు.
గౌతం గంభీర్ 92 పరుగులతో భారత్ విజయానికి బాటలు వేశాడు. చివరిలో ధోనీ అజేయంగా 44 పరుగులు చేసి, టీమిండియాకు నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. మరో రెండు బంతులు మిగిలి ఉండగా, ఆరు వికెట్లకు భారత్ 270 పరుగులు చేసింది.

- సత్య