బిజినెస్

విశాఖ కంటైనర్ టెర్మినల్‌కు భారీ నౌక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 20: విశాఖ కంటైనర్ టెర్మినల్‌కు శుక్రవారం భారీ నౌక వచ్చింది. 318 మీటర్ల పొడవున్న ఎంవి మెర్క్స్ సీబార్క్ అనే నౌక ఇక్కడికి చేరుకుంది. విశాఖ పోర్టు చరిత్రలో ఇంత భారీ కంటైనర్ నౌక ఇప్పటి వరకూ రాలేదు. ఈ నౌక 6,648 కంటైనర్లను మోసుకు వెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ సందర్భంగా కంటైనర్ టెర్మినల్‌లో జరిగిన కార్యక్రమానికి ఐఆర్‌టిఎస్ అధికారి పిఎల్ హర్‌నాథ్ హాజరయ్యారు. ఇంత భారీ నౌక విశాఖ కంటైనర్ టెర్మినల్‌కు రావడం ద్వారా కొత్త చరిత్రకు తెరతీసినట్టయిందన్నారు. కంటైనర్ టెర్మినల్ మరింత అభివృద్ధి చెందడానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయన్నారు. పోర్టు, విశాఖ కంటైనర్ టెర్మినల్ మెరైన్ డిపార్ట్‌మెంట్ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. విశాఖ పోర్టు ట్రస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ ఎస్‌ఎస్ త్రిపాఠి, విశాఖ కంటైనర్ టెర్మినల్ డిటిఎం బి రత్నశేఖరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విశాఖ కంటైనర్ టెర్మినల్‌కు వచ్చిన భారీ నౌక సీబార్క్