బిజినెస్

‘సైబర్’ బాధితులు 11.3 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: సైబర్ నేరాలకు దేశంలో దాదాపు 11.3 కోట్ల మంది సగటున రూ. 16,558 మేర నష్టపోయారని, దీనికి తోడు వ్యక్తిగత ఆర్థిక వివరాలు బైటి వాళ్లకు లీక్ అయినందుకు మానసిక ఒత్తిడికి సైతం గురయ్యారని సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ సంస్థ నార్టన్ ఇండియా ఒక నివేదికలో వెల్లడించింది. సైబర్ నేరాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి సగటున నష్టపోతున్న మొత్తం రూ 23,878 (358 డాలర్లు)గా ఉందని ఆ నివేదిక స్పష్టం చేసింది. సైబర్ నేరం నిజంగా మనోభావాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.. తమ వ్యక్తిగత ఆర్థిక సమాచారం లీకయితే సర్వం కోల్పోయినట్లుగా తమకు అనిపిస్తుందని ప్రతి పది మందిలో ఎనిమిది మంది చెబుతున్నారని దేశంలో నార్టన్ ఇండియా మేనేజర్ రితేశ్ చోప్రా అన్నారు. ‘వినియోగదారులు ఏ వివరాలనైతే రహస్యంగా ఉంచాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా బైటపడిపోతున్నాయని మా నివేదిక వెల్లడిస్తోంది. గత ఏడాది దేశంలోని ఆన్‌లైన్ జనాభాలో 48 శాతం మంది అంటే దాదాపు 11.3 కోట్ల మంది సైబర్ నేరాల ప్రభావానికి గురయినారు’ అని చోప్రా చెప్పారు. అయితే ఒక వేళ తాము ఏదయినా ఆన్‌లైన్ నేరానికి గురయిన పక్షంలో ఏం చేయాలో తమకు తెలుసునని గట్టిగా భావిస్తున్న వారు 40 శాతం మందే ఉన్నారని ఆయన చెప్పారు. దీంతో దాదాపు అరవై శాతం మంది రెస్పాండెంట్లు సైబర్ నేరాలను ఎదుర్కోవడం పట్ల ఆందోళనగా ఉన్నట్లు ఆ నివేదికలో వెల్లడయింది. అంతేకాదు తమ పర్సులో సొమ్ముపోగొట్టుకోవడం కన్నా తమ క్రెడిట్ కార్డు సమాచారం దొంగిలించబడుతుందేమోనన్న భయాన్ని 54 శాతం మంది వ్యక్తం చేసారు. వ్యక్తిగతంగా తాము క్రెడిట్ కార్డు మోసాలను అనుభవించామనో లేక, అలాంటి మోసాలకు గురయిన వారు తమకు తెలుసుననో 52 శాతం మంది చెప్పడం గమనార్హం. కాగా, ఇలాంటి సైబర్ మోసాలకు గురయ్యే వాళ్లలో ఆధునిక టెక్నాలజీని తక్కువగా వినియోగించుకునే 50 ఏళ్ల పైబడిన వయసు వారికన్నా కూడా నిత్యం ఆధునిక టెక్నాలజీలో మునిగి తేలే యువతరం (1980-2000 సంవత్సరాల మధ్య పుట్టిన) వారే ఎక్కువని ఆ నివేదిక పేర్కొనడం గమనార్హం. అంతేకాదు సైబర్ నేరాల విషయంలో ఇంతగా ఆందోళన చెందుతున్నప్పటికీ తాము సెక్యూర్డ్ పాస్‌వర్డ్‌ను ఉపయోగిస్తున్నామని చెప్తున్న వాళ్లు 41 శాతం మందే ఉన్నారని చోప్రా చెప్పారు. అలాగే ఆన్‌లైన్ ద్వారా ఇతరులకు సులభంగా తెలిసిపోయే సున్నితమైన ఖాతాల పాస్‌వర్డ్‌లాంటి వాటి వివరాలను స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకుంటుంటామని చాలామంది చెప్పడం గమనార్హం.