బిజినెస్

పెరిగిన హెచ్‌సిఎల్ టెక్ లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ఐటి సేవల సంస్థ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో గతంతో పోల్చితే 16.7 శాతం పెరిగి 2,014 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో 1,726 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం కూడా 14.1 శాతం ఎగబాకగా, ఈసారి 11,519 కోట్ల రూపాయలుగా, పోయినసారి 10,097 కోట్ల రూపాయలుగా ఉందని ఓ ప్రకటనలో హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ శుక్రవారం తెలిపింది. ఇదిలావుంటే హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ సిఇఒ అనంత్ గుప్తా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో సంస్థ సిఒఒ సి విజయ్‌కుమార్ వచ్చారు. వ్యక్తిగత కారణాలతోనే గుప్తా సంస్థను వీడినట్లు హెచ్‌సిఎల్ తెలిపింది. మరోవైపు 85 మిలియన్ డాలర్లకు బట్లర్ అమెరికా ఏరోస్పేస్‌ను హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ కొనుగోలు చేసింది. నగదు లావాదేవీల్లో ఈ కొనుగోలు జరగగా, బట్లర్ అమెరికా ఏరోస్పేస్‌ను సొంతం చేసుకోవడంతో ఏరోస్పేస్‌తోపాటు డిఫెన్స్ ఇంజినీరింగ్ సేవల రంగంలో బలోపేతం కాగలమని హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ విశ్వాసం వ్యక్తం చేసింది.
కెయిర్న్ ఇండియా
కెయిర్న్ ఇండియా నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకం గా 139 శాతం పెరిగి 779 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఇది 326 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు శుక్రవారం సంస్థ తెలిపింది.