బిజినెస్

ప్రపంచ స్థాయలో టాప్-15 సంపన్న నగరాల్లో ముంబయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: దేశ ఆర్థిక రాజధాని ముంబయి.. ప్రపంచంలోని అత్యంత సంపన్నవంతమైన 15 నగరాల్లో ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలో బ్రిటన్ రాజధాని లండన్ 2.7 ట్రిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, 2.6 ట్రిలియన్ డాలర్ల సంపదతో న్యూయార్క్, 2.2 ట్రిలియన్ డాలర్లతో జపాన్ రాజధాని టోక్యో వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయని ‘న్యూ వరల్డ్ వెల్త్’ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. భారత్‌లో 28 మంది బిలియనీర్లతోపాటు దాదాపు 45 వేల మంది మిలియనీర్లకు నివాసంగా ఉన్న ముంబయి నగరం మొత్తం 820 బిలియన్ డాలర్ల సంపదతో ఈ జాబితాలో 14వ స్థానాన్ని దక్కించుకున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. ముంబయితోపాటు ఈ జాబితాలో చోటు దక్కించుకున్న చైనా వాణిజ్య రాజధాని షాంఘై, ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరాల్లో ఒకటైన సిడ్నీ గత దశాబ్ద (2006 నుంచి 2016 వరకు) కాలంలో సంపద పరంగా వేగవంతంగా వృద్ధిని సాధించాయని ఈ నివేదిక పేర్కొంది. ముంబయిలోనూ రానున్న దశాబ్దకాలం లో సంపద మరింత వేగంగా వృద్ధి చెందుతుందని భావిస్తున్నట్లు తెలిపింది. కాగా, జాబితాలో 4వ స్థానంలో శాన్ ఫ్రాన్సిస్కో (1.9 ట్రిలియన్ డాలర్లు) ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా బీజింగ్ (1.8 ట్రిలియన్ డాలర్లు), షాంఘై (1.6 ట్రిలియన్ డాలర్లు), లాస్ ఏంజిల్స్ (1.2 ట్రిలియన్ డాలర్లు), హాంకాంగ్ (1.1 ట్రిలియన్ డాలర్లు), సింగపూర్ (870 బిలియన్ డాలర్లు), చికాగో (860 బిలియన్ డాలర్లు), సిడ్నీ (850 బిలియన్ డాలర్లు), టోరంటో (850 బిలియన్ డాలర్లు), ఫ్రాంక్‌ఫర్ట్ (830 బిలియన్ డాలర్లు) ఉన్నాయ. 15వ స్థానంలో ఫ్రాన్స్ రాజధాని పారిస్ 800 బిలియన్ డాలర్లతో నిలిచింది.

వరంగల్ విమానాశ్రయాభివృద్ధికి
ముందుకు రావాలి

కేంద్ర పౌరవిమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు

ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, అక్టోబరు 21: తెలంగాణలోని వరంగల్ విమానాశ్రయాభివృద్ధికి ఆపరేటర్లు ముందుకు రావాల్సిన అవసరం ఉందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం విమానాశ్రయం నిర్మాణానికి సమయం పడుతుందని ఆయన తెలిపారు. ప్రాంతీయ విమాన అనుసంధాన పథకం కిందకు ఏపిలోని కడప విమానశ్రయాన్ని తీసుకురానున్నట్టు ఆయన వెల్లడించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన (ఉదే దేశ్ కా ఆమ్ నాగ్రిక్) ప్రాంతీయ విమాన అనుసంధాన పథకాన్ని అశోక్ గజపతిరాజు, కేంద్ర సహాయ మంత్రి జయంత్ సిన్హా శుక్రవారం ఢిల్లీలో ప్రారంభించారు. అనంతరం అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ శరవేగంగా వృద్ధి చెందుతున్న విమానయాన రంగానికి కేంద్రం మరింత ఊతమిచ్చే చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటికే కొత్త విమానయాన పాలసీని తీసుకొచ్చిన కేంద్రం.. రిజనల్ కనెక్టివిటిని పెంచడం కోసం ఫ్రెమ్‌వర్క్ రూపొందించినట్టు చెప్పారు. విమానయాన సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వాములను చేస్తూ ఈ ఫ్రేమ్‌వర్కు రూపొందించినట్టు తెలిపారు. ఈ నూతన పథకం వచ్చే జనవరి నెలాఖరుకల్లా ఆమల్లోకి వస్తుంద్న ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో నిరుపయోగంగా ఉన్న విమానాశ్రయాల వల్ల ప్రజాధనం వృధా అవుతుందని, వాటిని ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు.

ఆర్టీపీపీలో విద్యుదుత్పత్తికి అంతరాయం

ౄ నిలిచిపోయిన 1,050 మెగావాట్లు
ౄ 2వ యూనిట్ పునరుద్ధరణ

ఎర్రగుంట్ల, అక్టోబర్ 21: కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)లో సాంకేతిక లోపం కారణంగా శుక్రవారం ఐదు యూనిట్లలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీంతో 1,050 మెగావాట్ల ఉత్పత్తి ఆగిపోయింది. స్విచ్‌యార్డులో ఒక్కమారుగా చెలరేగిన మంటల కారణంగా మధ్యాహ్నం 12.05 గంటల ప్రాంతంలో అన్ని యూనిట్లు ట్రిప్ అయి ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఒక్కొక్క యూనిట్‌లో 210 మెగావాట్లు చొప్పున మొత్తం 5 యూనిట్లలో 1,050 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఆగిపోయింది. సిఇ సత్యసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఇంజినీర్లు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి సాయంత్రం 4.20 గంటలకు రెండవ యూనిట్‌ను పునరుద్ధరించారు.
మిగిలిన యూనిట్లను శుక్రవారం రాత్రి లేదా శనివారానికి పునరుద్ధరిస్తామని సిఇ తెలిపారు. ఇదిలా ఉండగా ఆర్టీపీపీలో గతంలో ఎప్పుడూ ఐదు యూనిట్లలో ఒకేసారి విద్యుదుత్పత్తి నిలచిపోయిన సంఘటనలు లేవు. సాంకేతికలోపం ఎలా జరిగిందన్న దానిపై పరిశీలన చేస్తున్నట్లు సిఇ చెప్పారు. శనివారం నాటికి అన్ని యూనిట్లను పునరుద్ధరించి పూర్తిసామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

కొత్త పరిశ్రమలకు సింగిల్ డెస్క్ విధానం

14 నుండి 21 రోజుల్లో అనుమతులు ౄ ఏపి కర్మాగారాల శాఖ సంచాలకుడు బాలకిశోర్

ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, అక్టోబర్ 21: కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేవారి సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ డెస్క్ విధానం అమలు చేస్తోందని ఆంధ్ర రాష్ట్ర కర్మాగారాల శాఖ సంచాలకుడు, జాతీయ భద్రతా మండలి చీఫ్ ప్యాట్రాన్ జి బాలకిశోర్ చెప్పారు. దరఖాస్తు చేసుకున్న 14 నుంచి 21 రోజుల వ్యవధిలో అన్ని శాఖల అనుమతులు లభిస్తాయన్నారు. కర్మాగారాల శాఖ నుంచి కేవలం రెండు, మూడు రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమల్లో ఆరోగ్య పరిరక్షణ-్భద్రతపై భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారుల సంఘం ఆంధ్రా రీజియన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కర్మాగారాల శాఖ, జాతీయ భద్రతా మండలి ఆంధ్రప్రదేశ్ విభాగం శుక్రవారం సంయుక్తంగా సదస్సు నిర్వహించాయి. సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో రొయ్యల పరిశ్రమ బాగా అభివృద్ది చెందుతోందన్నారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ పరిశ్రమ అనేక ఒడుదొడుకులకు లోనై ఇప్పుడిప్పుడే నిలదొక్కుకొని అంతర్జాతీయ మార్కెట్‌లో పేరు సంపాదించిందన్నారు. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమందికి ఉపాధి లభిస్తోందన్నారు. గతంలో కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు ఉండేవని, రాన్రానూ కోస్తా ప్రాంతమంతటా ఇవి విస్తరించాయన్నారు. ఇప్పుడు ఈ ఆక్వా పరిశ్రమలు రెండింతలు పెరగనున్నాయని, నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు అన్ని ప్రాంతాల్లో ఇవి ఏర్పాటవుతున్న నేపథ్యంలో కొందరు అవగాహన లేకుండా అపోహలు సృష్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కాగా, గతంలో హైదరాబాద్‌ను అనుకుని పరిశ్రమలు స్థాపించారని, ఆ తర్వాత స్థానం విశాఖపట్నం కైవసం చేసుకుందన్నారు.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌కి విశాఖ ఒక వరంగా మారిందని, విశాఖపట్టణం, నెల్లూరు జిల్లాల్లో ఫార్మా కంపెనీలు వచ్చాయని, కెమికల్ ఫ్యాక్టరీ కూడా వస్తున్నాయన్నారు. విజయనగరం, శ్రీకాకుళంకు కూడ ఇవి విస్తరించాయని బాలకిశోర్ వెల్లడించారు. ప్రముఖ ఎగుమతుల సంస్థ సూర్యా ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత యిర్రింకి సూర్యారావు అధ్యక్షతన ఈ సదస్సు జరిగింది.