బిజినెస్

భయాందోళనలు అక్కర్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: భారతీయ బ్యాంకింగ్ పరిశ్రమలో 32 లక్షలకుపైగా కార్డు వినియోగదారుల భద్రతను సందిగ్ధంలోకి నెడుతూ వెలుగుచూసిన డెబిట్ కార్డు డేటా చౌర్యం వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర నివేదికను సేకరిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)తోపాటు బ్యాంకులను ఈ అంశానికి సంబంధించిన వివరాలను అందించాలని ప్రభుత్వం కోరినట్లు చెప్పారు. అలాగే సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు అన్నివిధాలా సిద్ధంగా ఉండాలని కూడా ఆర్‌బిఐకి, బ్యాంకులకు సూచించినట్లు ఇక్కడ విలేఖరులతో పేర్కొన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐతోపాటు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకులు ఈ ఉదంతంతో చాలావరకు కార్డులను రీకాల్ చేశాయి. ఎస్‌బిఐ 6 లక్షల కార్డులను వెనక్కి తీసుకోగా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిబిఐ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్‌లు కూడా కార్డులను రీకాల్ చేశాయి. మరికొన్ని బ్యాంకులు కార్డుల పిన్ నెంబర్లను మార్చుకోవాలంటూ తమ ఖాతాదారులకు సూచించాయి. వీటిలో ప్రైవేట్‌రంగ బ్యాంకులైన ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, యెస్ బ్యాంక్‌లున్నాయి. అలాగే ఖాతాదారులు తమ సొంత బ్యాంక్ ఎటిఎమ్‌లనే వాడాలంటూ సూచించాయి. దేశవ్యాప్తంగా దాదాపు 60 కోట్ల డెబిట్ కార్డులు పనిచేస్తుండగా, ఇందులో 19 కోట్ల కార్డులను భారత్‌కు చెందిన రూపే రూపొందించింది. మిగతావి అంతర్జాతీయ సంస్థలైన వీసా, మాస్టర్ కార్డులు తయారుచేశాయి. ఇకపోతే 19 బ్యాంకుల నుంచి మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు తెలుస్తుండగా, ఇందులో ఇప్పటిదాకా కొన్ని బ్యాంకులు మాత్రమే విదేశాల్లో తమ ఖాతాదారుల కార్డుల ద్వారా మోసపూరిత లావాదేవీలు జరిగాయని ప్రకటించాయి. చైనా, అమెరికాల్లో ఇవి జరిగినట్లు సమాచారం. కాగా, కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ మాట్లాడుతూ ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సత్వర చర్యలు చేపడతామని భరోసా హామీ ఇచ్చారు. హిటాచీ పేమెంట్స్ సర్వీసెస్ సిస్టమ్స్‌లో ఓ మాల్వేర్ ద్వారా ఇదంతా జరిగినట్లు అనుమానిస్తున్నారు. యెస్ బ్యాంక్‌తోపాటు కొన్ని వైట్-లేబుల్ ఎటిఎమ్‌లకు ఈ మాల్వేర్ నుంచి సేవలు అందుతున్నాయి. అయితే తమ ద్వారా ఎలాంటి తప్పిదం జరగలేదని హిటాచీ వాదిస్తోంది. ఇకపోతే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివరాల ప్రకారం 19 బ్యాంకులకు చెందిన 641 మంది డెబిట్ కార్డు డేటా చౌర్యానికి గురైనట్లు తెలుస్తోంది. వీటి విలువ 1.3 కోట్ల రూపాయలు. అయితే 26.5 లక్షల వీసా, మాస్టర్‌కార్డులు, 6 లక్షల రూపే కార్డులు ఈ వ్యవహారంతో ప్రభావితమయ్యాయని, ఓ 90 ఏటిఎమ్‌ల నుంచి డేటా దొంగిలించబడినట్లు సమాచారం. కాగా, వ్యవసాయోత్పత్తి పెరగడానికి సాగునీటి రంగంలో పెట్టుబడులు కీలకమని జైట్లీ కాగ్ సమావేశంలో అన్నారు. అలాగే బ్యాంకింగ్ రంగం, ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న మొండి బకాయిల విషయంలో ప్రభావవంతమైన చర్యలతో ముందుకెళ్ళాల్సిన అవసరం ఉందని జైట్లీ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే అవినీతి, లోపభూయిష్టాన్ని వేర్వేరుగా చూడాల్సిన అవసరం కూడా ఉందన్నారు. అలాగే మదుపరుల విశ్వాసాన్ని చూరగొనడానికి ఆర్బిట్రల్ సెంటర్ల పునరుద్ధరణ అవసరమన్నారు.

చిత్రం... కాగ్ సమావేశంలో మాట్లాడుతున్న జైట్లీ

ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలపై జరిమానా

టెలికామ్ శాఖకు ట్రాయ్ సిఫార్సు

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలపై 3,050 కోట్ల రూపాయల జరిమానా విధించాలని టెలికామ్ శాఖకు టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్ శుక్రవారం సూచించింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోకు ఈ మూడు సంస్థలు సహకరించకపోవడమే ఈ జరిమానాకు అసలు కారణం. జియోకు ఇంటర్‌కనెక్టివిటీని ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా ఇవ్వడం లేదన్నది ఆరోపణ. కాగా, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌పై చెరో 1,050 కోట్ల రూపాయల జరిమానాను సూచించిన ట్రాయ్.. ఐడియాపై 950 కోట్ల రూపాయల జరిమానా విధించాలని టెలికామ్ శాఖకు రాసిన లేఖలో ట్రాయ్ సిఫార్సు చేసింది.

2018 డిసెంబర్ నాటికి రూ. 12 వేల కోట్లు చెల్లిస్తాం

సుప్రీం కోర్టుతో సహారా

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: సెబీ-సహారా కేసులో 2018 డిసెంబర్ నాటికి మిగతా 12,000 కోట్ల రూపాయలను డిపాజిట్ చేస్తామంటూ సుప్రీం కోర్టుకు సహారా గ్రూప్ శుక్రవారం తెలిపింది. ఇందుకు సంబంధించి పక్కా ప్రణాళికతో అత్యున్నత న్యాయస్థానం ఎదుటకు సహారా వచ్చింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ, ఆమికస్ క్యూరి, సీనియర్ న్యావాది శేఖర్ నఫడేలతో తమ ప్రణాళికను పంచుకుంటామని చీఫ్ జస్టిస్ టిఎస్ థాకూర్ నేతృత్వంలోని ధర్మాసనానికి సహారా గ్రూప్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ మధ్యంతర బెయిల్ గడువును నవంబర్ 28 వరకు పొడిగించిన సుప్రీం కోర్టు.. ఇతర ఏర్పాట్లకూ అనుమతించింది. డిపాజిట్ సమర్పణకు పక్కా ప్రణాళికతో రావాలన్న సుప్రీం గత సూచనతోనే తాజాగా సహారా ఓ ప్రణాళికతో వచ్చింది.

తెలంగాణ సిఎస్‌ను
కలిసిన తోషిబా చైర్మన్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 21: జపాన్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ తోషిబా కార్పొరేషన్ చైర్మన్ శిగెనోరి శిగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీశ్ శర్మను శుక్రవారం సచివాలయంలో కలిశారు. భారత్‌లో, తెలంగాణలో తమ కార్యకలాపాల గురించి వివరించగా, తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని శర్మ యన్ను ఆకోరారు.