బిజినెస్

పెరిగిన కొటక్ మహీంద్ర లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 25: దేశీయ ప్రముఖ ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో ఒకటైన కొటక్ మహీంద్ర బ్యాంక్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ద్వితీయ త్రైమాసికం (జూలై- సెప్టెంబర్)లో నిరుడుతో పోల్చితే 27.6 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో బ్యాంక్ లాభం 941.89 కోట్ల రూపాయలుగా ఉంటే, ఈసారి 1,202.40 కోట్ల రూపాయలుగా ఉంది. ఏకీకృత ఆదాయం ఈసారి 8,415 కోట్ల రూపాయలుగా, పోయినసారి 6,729 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు మంగళవారం బ్యాంక్ తెలియజేసింది. కాగా, స్టాండలోన్ ఆధారంగా బ్యాంక్ లాభం ఈ జూలై-సెప్టెంబర్‌లో 813 కోట్ల రూపాయలుగా, క్రిందటిసారి 570 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం 4,621 కోట్ల రూపాయల నుంచి 5,244 కోట్ల రూపాయలకు పెరిగిందని కొటక్ మహీంద్ర బ్యాంక్ స్పష్టం చేసింది.